Telugu Gateway
Top Stories

బిలియనీర్ల భారతం

బిలియనీర్ల భారతం
X

ఒక బిలియన్ అంటే మన భారతీయ కరెన్సీ లో చూస్తే 8200 కోట్ల రూపాయలు. అలాంటిది ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలు. ఖండాల్లో కలుపుకుని మొత్తం 2640 మంది బిలియనీర్లు ఉన్నారు. అగ్రరాజ్యం అమెరికాలోనే అత్యధిక మంది బిలియనీర్లు ఉన్నట్లు నివేదికలు చెపుతున్నాయి. అమెరికాలో ఎక్కువగా అంటే 735 మంది బిలియనీర్లు ఉండగా...చైనాలో 495 మంది ఉన్నారు. చైనా ఈ జాబితా లో రెండవ ప్లేస్ లో ఉంది. 169 మంది బిలియనీర్లతో ఇండియా మూడవ స్థానం దక్కించుకుంది. జర్మనీలో 126 మంది బిలియనీర్లు ఉండగా...రష్యా లో ఈ సంఖ్య 105 గా నిలిచింది. ఈ ఏడాది కొత్తగా బిలియనీర్ల జాబితాలోకి 50 మంది వచ్చి చేరారు.

భారత్ లోని 169 మంది బిలియనీర్ల సంపద అంతా కలిపితే 675 బిలియన్ డాలర్లుగా ఉంది. కరోనా సమయంలో బిలియనీర్ల సంపద గణనీయంగా పెరగ్గా...ఇటీవల కాలంలో ఇది పెద్ద ఎత్తున తగ్గుముఖం పట్టడం విశేషం. భారత్ లో బిలియనీర్ల సంపద తగ్గుముఖం పట్టడానికి గౌతమ్ అదానీ ఒక ప్రధాన కారణంగా ఉంది. అమెరికా కు చెందిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత అటు అదానీ గ్రూప్ తో పాటు వ్యక్తిగతంగా కూడా గౌతమ్ అదానీ మార్కెట్ విలువ పెద్ద ఎత్తున నష్టయిపోయిన విషయం తెలిసిందే.

Next Story
Share it