Telugu Gateway
Top Stories

యూఏఈ, యూఎస్ లకు భారత్ సెల్ ఫోన్లు ఎగుమతి

యూఏఈ, యూఎస్ లకు భారత్ సెల్ ఫోన్లు ఎగుమతి
X

మొబైల్ ఫోన్ల ఎగుమతిలో భారత్ రికార్డు సృష్టించింది. 2023 మార్చి తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఇండియా నుంచి 85 వేల కోట్ల రూపాయల సెల్ ఫోన్లు ఎగుమతి అయ్యాయి. దీనికి ప్రధాన కారణం కేంద్రంలోని మోడీ సర్కారు తీసుకొచ్చిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సహక స్కీం (పీఎల్ఐ ) ప్రధాన కారణం అని ఇండస్ట్రీ వర్గాలు చెపుతున్నాయి. ఇండియా సెల్యూలర్ అండ్ ఎలక్ట్రానిక్ అసోసియేషన్ ( ఐసిఈఏ) గణాంకాల ప్రకారం భారత్ నుంచి సెల్ ఫోన్లు ఎక్కువగా యూఏఈ తో పాటు అమెరికా, నెథర్లాండ్స్, యూకె, ఇటలీ కి ఎగుమతి అయ్యాయి. ఈ దేశాలు తొలి ఐదు స్థానాల్లో ఉన్నాయి. దేశంలో అమ్మకాలు సాగుతున్న స్మార్ట్ ఫోన్లు 97 శాతం ఇండియాలోనే తయారు అవుతున్నాయి. ఇండియా ఇప్పుడు ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద మొబైల్ తయారీ దేశంగా నిలిచింది.

ఇదే ఊపుతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లక్ష కోట్ల సెల్ ఫోన్ ఎగుమతులు సాధించాలని ఎలక్ట్రానిక్స్, ఐటి మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. 2027 సంవత్సరానికి ఇండియా లోనే ఐ ఫోన్ ల తయారీ 50 శాతం వరకు చేరే అవకాశం ఉంది అని అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు చైనా లోనే ఎక్కువగా ఐ ఫోన్లు తయారు అవుతూ వస్తున్నాయి. ఇప్పుడు ఇది భారత్ కు మారుతుంది. భారత్ తో పాటు వియత్నాం కూడా మరో లబ్దిదారుగా మారనుంది. ఐ ఫోన్ ఒక్క డిసెంబర్ లోనే ఇండియా నుంచి ఏకంగా 8200 కోట్ల రూపాయల సెల్ ఫోన్లను ఎగుమతి చేసి రికార్డు నెలకొల్పింది. ఇప్పుడు దేశం ప్రధానంగా ఎగుమతే లక్ష్యంగా సెల్ ఫోన్ల తయారీపై ఫోకస్ పెట్టింది.

Next Story
Share it