దేశంలో కరోనా కేసులు పదివేల స్థాయికి
భారత్ ను కరోనా కష్టాలు పూర్తిగా వీడినట్లే కన్పిస్తున్నాయి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా దేశంలో నమోదు అవుతున్న కేసుల సంఖ్య వైరస్ పతన దశను చూపిస్తోంది. గత 24 గంటల్లో కొత్తగా దేశ వ్యాప్తంగా నమోదు అయిన కేసులు 10273 మాత్రమే. ఇదే సమయంలో 243 మంది మరణించారు. ఒక్క రోజులోనే 20439 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 1,11,472కు తగ్గాయి. కొత్త కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టడంతో దేశ వ్యాప్తంగా కోవిడ్ టెస్ట్ ల సంఖ్య కూడా భారీగా తగ్గింది.
అయితే కొత్తగా వస్తున్న వార్తలు మాత్రం ప్రజల్లో ఒకింత ఆందోళన రేపుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా జూన్ నాటికి నాల్గవ వేవ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉందని అంటూ కొన్ని జాతీయ మీడియా కథనాలు ప్రసారం చేశాయి. అయితే దాని తీవ్రత ఎలా ఉంటుంది తదితర అంశాలను ప్రస్తావించలేదు. ఇది అంతా కూడా ప్రజలు తీసుకునే జాగ్రత్తలు..వ్యాక్సినేషన్ ప్రక్రియపైనే ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. అయితే చాలా మంది కోవిడ్ కథ ముగిసినట్లేనని..అది కూడా ఫ్లూ మాదిరిగానే ఉంటుందని తేల్చిచెబుతున్నారు.