Telugu Gateway
Top Stories

సింగిల్ డే... భార‌త్ లో ల‌క్ష కేసులు దాటేశాయి

సింగిల్ డే...  భార‌త్ లో ల‌క్ష కేసులు దాటేశాయి
X

మ‌ళ్ళీ పాత క‌థే రిపీట్ అవుతోంది. దేశంలో రోజు వారి కేసుల సంఖ్య ల‌క్షల‌కు ల‌క్షలు దాటుతున్నాయి. గడిత‌24 గంటల్లోనే కొత్తగా 1,17,100 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి 302 మంది మృతి చెందారు. మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి చాలా ఎక్కువగా ఉంది. ఒక్కరోజులోనే అక్కడ 36, 265 కొత్త కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం దేశంలో 3,71,363 యాక్టివ్ కరోనా ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ కరోనా బులెటిన్‌ను విడుదల చేసింది. గడిచిన ఇరవై నాలుగు గంటల్లో 30, 836 మంది, కరోనా మొదలైనప్పటి నుంచి మొత్తంగా 3, 43, 71, 845 మంది వైరస్‌ బారి నుంచి కోలుకున్నారు. పాజిటివిటీ రేటు 7.74 శాతంగా ఉంది. తాజాగా నమోదైన 302 మరణాలతో మొత్తం భారత్‌లో 4, 83, 178 మరణాలు చోటు చేసుకున్నాయి.

ఇప్పటివ‌ర‌కూ 149 కోట్ల వ్యాక్సిన్‌ డోసుల్ని అందించినట్లు కేంద్రం ప్రకటించింది. 27 రాష్ట్రాల్లో 3, 007 ఒమిక్రాన్‌ కేసులు నమోదు అయ్యాయని, అందులో 1,199 మంది పేషెం‍ట్లు కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే ఒమిక్రాన్ కార‌ణంగానే ఎక్కువ కేసులు న‌మోదు అవుతున్న‌ట్లు చెబుతున్నారు. ఈ వైర‌స్ వ్యాప్తి చాలా వేగంగా ఉంది. అగ్ర‌రాజ్యం అమెరికాతో పాటు ప‌లు దేశాలు కొత్త కేసుల‌తో అల్లాడుతున్నాయి.అక్క‌డ న‌మోదు అవుతున్న వాటిలో అత్య‌దిక కేసులు ఒమిక్రాన్ వేరియంట్ వే. జ‌న‌వ‌రి నెలాఖ‌రు నాటికి దేశంలో కేసుల సంఖ్య మ‌రింత పెరిగే ప్ర‌మాదం ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు.

Next Story
Share it