Telugu Gateway
Top Stories

దిగొస్తున్న క‌రోనా కేసులు

దిగొస్తున్న క‌రోనా కేసులు
X

ప్ర‌జ‌ల‌కు అత్యంత ఊర‌ట క‌ల్పించే ప‌రిణామం. దేశంలో క‌రోనా మూడ‌వ ద‌శ వేగంగా త‌గ్గుముఖం ప‌డుతోంది. కొత్త కేసులు త‌క్కువ‌గా న‌మోదు కావ‌టంతోపాటు యాక్టివ్ కేసుల్లో త‌గ్గుద‌ల కూడా భారీగానే ఉంది. దీంతో మూడ‌వ ద‌శకు త్వ‌ర‌లోనే ముగింపు ప‌డ‌నుంది. దేశ వ్యాప్తంగా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ వేగం పుంజుకోవ‌టం కూడా సానుకూల పరిణామంగా ఉంది. గ‌త 24 గంట‌ల్లో దేశ వ్యాప్తంగా 34,113 కొత్త కేసులు వెలుగు చూశాయి. ఇదే స‌మ‌యంలో 346 మంది చ‌నిపోయారు.

యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 4,78,882కు త‌గ్గుముఖం ప‌ట్టాయి. ప్ర‌తి దశ‌లోనే అత్య‌ధిక కేసులు న‌మోదు అయిన దేశ రాజ‌ధాని ఢిల్లీతోపాటు మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు, కేర‌ళ‌ల్లో కూడా కేసులు ప‌రిమిత సంఖ్య‌లోనే న‌మోదు అవుతున్నాయి. అందుకే రాష్ట్రాలు అన్నీ ఇప్ప‌టికే క‌రోనా ఆంక్షలు అన్నీ తొల‌గిస్తున్నాయి. అంతా అనుకున్న‌ట్లు సాగితే ఫిబ్ర‌వ‌రి నెలాఖ‌రు నాటికి ప‌రిస్థితి పూర్తిగా అదుపులోకి రావ‌టం ఖాయంగా క‌న్పిస్తోంది.

Next Story
Share it