Telugu Gateway

మూడు లక్షలకు చేరువలో కరోనా కేసులు

మూడు లక్షలకు చేరువలో కరోనా కేసులు
X

దేశంలో కరోనా కేసుల రోజుకో కొత్త ప్రపంచ రికార్డును నమోదు చేస్తున్నాయి. ప్రపంచంలో ఏ దేశంలోనూ ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదు కాలేదు. ఊహించని స్థాయిలో కేసులు పెరుగుతుండటంతో పలు రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూల బాట పడుతున్నాయి. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా ఏకంగా 2,73,810 మంది కరోనా బారిన పడ్డారు.

ఇప్పటివరకూ నమోదు అయిన అత్యధిక కేసులు ఇవే. వీటితో కలుపుకుంటే దేశంలో ఇప్పటివరకూ నమోదు అయిన కరోనా కేసులు మొత్తం 1,50,61,919కి చేరాయి. దేశంలో ప్రస్తుతం 19,29,329 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకూ 12,38,566 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు.

Next Story
Share it