Telugu Gateway
Top Stories

మూడు లక్షల దిగువకు కరోనా కేసులు

మూడు లక్షల దిగువకు కరోనా కేసులు
X

దేశంలో వరసగా కొన్ని రోజులుగా పాటు నాలుగు లక్షలకుపైగా నమోదు అయిన కేసులు గత కొన్ని రోజులుగా క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. అయితే ఆదివారం నాడు తొలిసారి దేశంలో నమోదు అయిన కరోనా కేసులు మూడు లక్షల దిగువకు రావటం ఒకింత ఊరట కలిగించే పరిణామంగానే చెప్పుకోవచ్చు. పలు రాష్ట్రాల్లో అమలు అవుతున్న లాక్ డౌన్ వల్ల సత్ఫలితాలు వస్తున్నట్లే కన్పిస్తున్నాయి. అయితే పాజిటివ్ కేసులు తగ్గినా.. కరోనా మరణాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో గత 24 గంటల్లో 15,73,515 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 2,81,386 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 2,49,65,463కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4,106 మంది మృతి చెందగా, ఇప్పటివరకు ఇప్పటివరకు 2,74,390 మంది మరణించారు. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 3,78,741 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటివరకు 2,11,74,076 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. దేశంలో ప్రస్తుతం 35,16,997 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Next Story
Share it