Telugu Gateway
Top Stories

రెండు ల‌క్షల దిగువ‌కు క‌రోనా కేసులు

రెండు ల‌క్షల దిగువ‌కు క‌రోనా కేసులు
X

దేశంలో క‌రోనా థ‌ర్డ్ వేవ్ త‌గ్గుముఖం ప‌డుతున్నట్లు స్ప‌ష్ట‌మైన సంకేతాలు క‌న్పిస్తున్నాయి. గ‌త కొన్ని రోజులుగా రెండు ల‌క్షల‌పైనే కొన‌సాగుతున్న కేసులు తాజాగా త‌గ్గుముఖం ప‌ట్టాయి. తొలిసారి రెండు ల‌క్షల దిగువ‌న న‌మోదు అయ్యాయి. గడిచిన 24 గంటలలో 1,67,059 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటలలో 2,54,076మంది వైరస్‌ బారి నుంచి కోలుకున్నారు. క‌రోనా మహమ్మారి బారిన పడి 1192 మంది మ‌ర‌ణించారు. .ప్రస్తుతం దేశంలో 17,43,059 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 11.69 శాతంగా ఉంది. మరోవైపు ఒమిక్రాన్‌ కేసులు కూడా శరవేగంగా పెరుగుతున్నాయి.

ఇప్పటి వరకు దేశంలో 1,66,68,48,204 మంది వ్యాక్సినేషన్‌ పూర్తిచేసుకున్నారు. అయితే దేశంలో ప్ర‌స్తుతం న‌మోదు అవుతున్న కేసుల్లో ఎక్కువ శాతం ఒమిక్రాన్ ర‌కానివే అని చెబుతున్నారు. తొలి నుంచి నిపుణులు చెబుతున్న‌ట్లు ఫిబ్ర‌వ‌రి 15 నాటికి దేశంలో క‌రోనా మూడ‌వ ద‌శ చాలా వ‌ర‌కూ తగ్గుముఖం ప‌ట్టే అవ‌కాశం ఉంది. అయితే ఒమిక్రాన్ వైర‌స్ లోనూ మ‌రో కొత్త వేరియంట్ ను సింగ‌పూర్ తోపాటు ప‌లు దేశాల్లో గుర్తించారు. అయితే దీని తీవ్ర‌త‌..ప్ర‌భావం వంటి అంశాల‌పై ఇంకా అధ్య‌య‌నాలు సాగుతున్నాయి.

Next Story
Share it