Telugu Gateway
Top Stories

కరోనా కేసుల్లో భారత్ రోజుకో కొత్త రికార్డు

కరోనా కేసుల్లో భారత్ రోజుకో  కొత్త రికార్డు
X

కోవిడ్ 19 కేసులు..మరణాల విషయంలో భారత్ రోజుకో కొత్త రికార్డు నమోదు చేస్తోంది. మధ్యలో స్వల్పంగా కేసులు తగ్గినట్లు కన్పించినా మళ్ళీ భారీగా పెరిగాయి. దీంతో మే నెలలో ఇది ఎంత పీక్ కు వెళుతుందో అన్న టెన్షన్ ప్రజల్లో నెలకొంది. మే 15 నాటికి భారత్ లో కరోనా కేసులు నూతన గరిష్టాలను తాకుతాయి అనే అంచనాలు వెలువడ్డాయి. ఇప్ప్పుడే భారత్ ప్రపంచ రికార్డులు నెలకొల్పుతుంటే ..మరి అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవటానికే కష్టంగా ఉంటుందని చెబుతున్నారు. దేశంలో వరుసగా ఎనిమిదో రోజు కూడా కరోనా కేసులు 3 లక్షలకు పైగా నమోదయ్యాయి.

గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,79,257 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఒకరోజు నమోదైన కేసుల్లో ఇవే అత్యధికం. కొత్తగా నమోదైన కేసులతో కలిపి దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,83,76,524 కు చేరింది. బుధవారం ఒక్కరోజే వైరస్‌ బాధితుల్లో 3,645 మంది మరణించినట్లు కేంద్రం తెలిపింది. దీంతో మొత్తం మృతు సంఖ్య 2,04,832 కు చేరింది.

Next Story
Share it