మాంద్యం రిస్క్ పెరుగుతోంది..ఐఎంఎఫ్ చీఫ్ హెచ్చరిక

ప్రపంచ ఆర్దిక వ్యవస్థ ఊహించిన దాని కంటే గడ్డుకాలం ఎదుర్కోకతప్పదని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) ప్రధానాధికారి క్రిస్ట్రిలినా జార్జివా వ్యాఖ్యానించారు. 2022 సంవత్సరమే కాదు...2023లో కూడా మరింత గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి రావొచ్చని ఆమె ఐఎంఎఫ్ బ్లాగ్ లో తన అభిప్రాయాలు తెలిపారు. మాంద్యం రిస్క్ పెరుగుతోందని ఆమె పేర్కొన్నారు. ద్రవ్యోల్భణం ఊహించిన దాని కంటే చాలా ఎక్కువగా ఉందని..అంతే కాదు..ఇది కేవలం ఆహారం. ఇంధనం వంటి వాటికే పరిమితం కాకుండా మరింత విస్తరిస్తుందని తెలిపారు.
ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ ప్రగతిని మరింత తగ్గించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా మానవ విషాదం మరింత పెరుగుతుందన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగిన జీ20 సమావేశంలో ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ వృద్ధి రేటు 3.6గా ఉంటుందని అంచనా వేశారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని..క్రిస్ట్రిలినా జార్జివా వెల్లడించారు. జీవన వ్యయాలు పెరిగి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. పేదలు అయితే తమ కుటుంబాలకు ఆహారం కూడా అందించలేకపోతున్నారని వెల్లడించారు.



