Telugu Gateway
Top Stories

బాబా రామ్ దేవ్ పై ఐఎంఏ ఫైర్..చర్యలకు డిమాండ్

బాబా రామ్ దేవ్ పై ఐఎంఏ ఫైర్..చర్యలకు డిమాండ్
X

కరోనా నివారణకు 'కరోనిల్' పేరుతో మందు తయారు చేసినట్లు నానా హంగామా చేసిన బాబా రామ్ దేవ్ ఇప్పుడు తన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే తమ కరోనిల్ కరోనాపై బాగా పనిచేస్తుంది అంటూ గత ఏడాది విడుదల చేశారు. నిజంగా అదే పనిచేసినట్లు అయితే..భారత్ ఇప్పుడు ఇంత సమస్య ఎదుర్కొని ఉండేదా?. ఇది అంతా పాత కథ. తాజాగా అల్లోపతి మందుల వల్ల లక్షలాది మంది చనిపోయారని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అత్యాధునిక మెడిసిన్ పై ఆయన తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) మండిపడింది.

గతంలోనూ ఆయన డాక్టర్లపై సంచలన వ్యాఖ్యలు చేశారని, వండర్‌ డ్రగ్స్‌ విడుదల సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ముందే డాక్టర్లను హంతకులన్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. యోగా గురుపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు శనివారం ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది. రామ్‌దేవ్‌ ఆయన సహచరుడు బాలక్రిష్ణ జీలు అనారోగ్యం పాలైనప్పుడు అల్లోపతి వైద్యమే చేయించుకుంటున్నారని తెలిపింది. తప్పుడు, నిరాధార ఆరోపణలు, ప్రకటనలు చేస్తూ జనాల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొంది. ''ఎపిడమిక్‌ డిసీజ్‌ యాక్ట్‌'' కింద ఆయనపై చర్యలు తీసుకోవాలని, విచారణకు ఆదేశించాలని కేంద్ర ఆరోగ్య శాఖను డిమాండ్‌చేసింది.

Next Story
Share it