Telugu Gateway
Top Stories

ఈ క్రూయిజ్ ఖరీదు 17 వేల కోట్లు

ఈ క్రూయిజ్ ఖరీదు 17 వేల కోట్లు
X

ప్రపంచంలోని అతి పెద్ద క్రూయిజ్ ఇదే. దీని ఖరీదు ఏకంగా 17 వేల కోట్ల రూపాయలు. ఐకాన్ అఫ్ సీస్ గా పిలుచుకునే ఈ క్రూయిజ్ ను రాయల్ కరీబియన్ ఇంటర్నేషనల్ డెవలప్ చేసింది. 365 మీటర్ల పొడవు ఉండే ఈ క్రూయిజ్ లో ఏకంగా 20 డెక్ లు ఉంటాయి. ఇందులో ఒకే సారి సిబ్బందితో కలుపుకుని పది వేల మంది ప్రయాణించే వెసులుబాటు ఉంటుంది. ఇందులో 40 కి పైగా రెస్టారెంట్స్, బార్స్, లాంజ్ లు ఉంటాయి. ఇందులో ప్రయాణానికి ఒక్కో టికెట్ కనీస ధర లక్ష నలభై నాలుగు వేల రూపాయలు.

గరిష్టంగా 2 .21 లక్షల రూపాయలు. అయితే ఈ క్రూయిజ్ ఎల్ పీజి తో నడుస్తుంది. దీనిపై పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని కారణం ఎల్ పీ జి వల్ల గాలిలోకి మిథేన్ కలుస్తుంది అని చెపుతున్నారు. ఈ క్రూయిజ్ లో నలభై చోట డైనింగ్ సౌకర్యాలు ఉంటాయి. దీన్ని కదిలే విలాసవంతమైన మెగా రిసార్ట్ గా పిలుస్తున్నారు. అమెరికా లోని మియామి నుంచి ఈ విలాసవంత క్రూయిజ్ జనవరి 27 న స్టార్ట్ అయింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో క్రూయిజ్ లు ఉండగా...ప్రపంచంలోనే అది పెద్ద క్రూయిజ్ అందరి దృష్టిని అక్కట్టుకుంటోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో విలాసవంత క్రూయిజ్ లు ఉన్నా కూడా ఈ ఐకాన్ అఫ్ సీస్ మాత్రం అందరి కళ్ళు పడ్డాయి అనే చెప్పాలి.

Next Story
Share it