Telugu Gateway
Top Stories

మోడీ కి ఎలాన్ మస్క్ ఫ్యాన్ అట!

మోడీ కి ఎలాన్ మస్క్ ఫ్యాన్ అట!
X

రాజకీయ నేతలను పొగిడి పనులు చేయించుకోవటంలో పారిశ్రామిక వేత్తలను మించిన వారు ఉండరు. ఇప్పుడు ప్రపంచంలోనే నంబర్ వన్ సంపన్నుడిగా ఉన్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కూడా అదే బాటలో ఉన్నట్లు కనిపిస్తున్నారు. భారత్ లో ఎలక్ట్రిక్ కార్లపై దిగుమతి సుంకం ప్రపంచంలోనే చాలా ఎక్కువగా ఉంది అని...వెంటనే సుంకాలు తగ్గించాలి అని అయన 2021 లో డిమాండ్ చేశారు. తాము భారత్ లో కూడా టెస్లా కార్లు విక్రయిస్తామన్నారు. అయితే భారత్ మాత్రం టెస్లా ఇండియా లో యూనిట్ ఏర్పాటు చేయాలని...ఎక్కడో తయారు చేసి...ఇక్కడ అమ్ముతాము అంటే కుదరదు అని స్పష్టం చేసింది. ఈ వివాదంపై మస్క్ అప్పటిలో ప్రభుత్వ తీరును తప్పుపట్టారు కూడా. ఇప్పుడు సీన్ మారింది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అమెరికా పర్యటనలో ఉన్న మోడీ తో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ న్యూ యార్క్ లో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తనను తాను మోదీ అభిమానిగా చెప్పుకున్న ఎలాన్ మస్క్ త్వరలో భారత్‌లో టెస్లా భారీ పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది అనే సంకేతాలు ఇచ్చారు.

ప్రధాని మోడీతో భేటీ అనంతరం భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖంగా ఉన్నట్లు.. వచ్చే ఏడాది తాను భారత్‌లో పర్యటిస్తానని ఎలాన్ మస్క్ తెలిపారు. ప్రధాని మోడీ భారత్ అభివృద్ధిలో ప్రత్యేక దృష్టి సారించారు అని . భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. మేం సరైన సమయంలో భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ఎలాన్ మస్క్ తెలిపారు.ప్రపంచంలోని ఇతర అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలకన్నా భారత్ భవిష్యత్ మరింత ఆశాజనకంగా ఉంటుంది అని మస్క్ తెలిపారు. మోడీ తో తన సమావేశం బాగా జరిగింది అని...సాధ్యమైనంత వేగంగా భారత్ లో టెస్లా యూనిట్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

Next Story
Share it