Telugu Gateway
Top Stories

బెయిల్ కు డబ్బులు కట్టను..జైలుకే వెళతా

బెయిల్ కు డబ్బులు కట్టను..జైలుకే వెళతా
X

ఇదో ఇంటరెస్టింగ్ కేసు. లండన్ -ముంబై విమానంలో ఒక ప్రయాణికుడు టాయిలెట్ లో నిబంధనలకు వ్యతిరేకంగా సిగరెట్ తాగాడు.అసలు విమానంలోకి సిగరెట్ ఎలా వెళ్ళింది అన్నది మరో కథ. అయితే రత్నాకర్ ద్వివేది అనే ఈ ప్రయాణికుడిపై కేసు నమోదు అయింది. అంథేరీ మెట్రోపాలిటన్ జడ్జి కోర్ట్ ఆయనకు 25 వేల రూపాయల క్యాష్ బెయిల్ మంజూరు చేసింది. ఈ డబ్బు కట్టి వెళ్లిపోవచ్చు, కానీ ఆ ప్రయాణికుడు ఆ మొత్తం కట్టడానికి నిరాకరించాడు. దీంతో కోర్ట్ అతన్ని జైలు కు పంపింది. తనపై నమోదు అయినా ఐపీసి సెక్షన్ ప్రకారం తనకు పడే జరిమానా 250 రూపాయలు మాత్రమే అని...ఆన్ లైన్ సెర్చ్ లో ఇదే చూపిస్తుంది అని వాదించారు.

అయితే విమానం లోని టాయిలెట్ లో సిగరెట్ తాగి ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు తీసుకొచ్చే ప్రయత్నం చేసినందున ఐపీసి లోని సెక్షన్ 336 కింద అతడిపై కేసు పెట్టారు.ఈ నిబంధన కింద 250 రూపాయలు కట్టమంటే కడతా లేదు అంటే లేదు అన్నారు. దీంతో అతడిని జైలు కు పంపారు. మార్చి 10 లండన్-ముంబై విమానంలో అనుచితంగా ప్రవర్తించటంతో పాటు పైలట్, ఇతర సిబ్బంది తో దురుసుగా ప్రవర్తించి గందరగోళానికి కారణం అయ్యాడు. గత కొంత కాలంగా విమాన ప్రయాణికుల్లో కొంత మంది అనుచితంగా వ్యవహరిస్తూ ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్న సంఘటనలు చాలానే నమోదు అవుతున్నాయి.

Next Story
Share it