Telugu Gateway
Top Stories

52 వారాల గరిష్ట స్థాయికి కంపెనీ షేర్లు

52  వారాల గరిష్ట స్థాయికి కంపెనీ షేర్లు
X

దేశంలో ఇప్పటివరకు అతి పెద్ద పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) అంటే హ్యుండయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ దే. గత ఏడాది హ్యుండయ్ ఐపీఓ కి వచ్చి 27,858 కోట్ల రూపాయలను మార్కెట్ నుంచి సమీకరించింది. ఒక్కో షేర్ ను కంపెనీ 1960 రూపాయల వద్ద జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ షేర్లు అక్టోబర్ 22 న మార్కెట్ లో లిస్ట్ అయ్యాయి. అప్పటి నుంచి ఇటీవల వరకు హ్యుండయ్ మోటార్ షేర్లు ఆఫర్ ప్రైస్ ను అధిగమించలేదు. కానీ గత కొన్ని రోజులుగా హ్యుండయ్ మోటార్ ఇండియా షేర్లలో పెద్ద ఎత్తున కదలిక వచ్చింది. ఇటీవలే తొలిసారి కంపెనీ షేర్లు 2000 రూపాయలను అధిగమించి నిలబడుతున్నాయి. అంటే గత రెండు రోజులుగా హ్యుండయ్ మోటార్ ఇండియా షేర్లు నూతన గరిష్ఠాలను కూడా తాకాయి అనే చెప్పాలి. బుధవారం నాడు కూడా ఈ కంపెనీ షేర్లు మొదటిసారి 52 వారాల గరిష్ట ధర 2145 రూపాయలకు చేరాయి. కానీ ఫైనల్ గా బిఎస్ఈ లో ఈ షేర్లు 53 రూపాయల లాభంతో 2125 రూపాయల వద్ద ముగిశాయి.

కంపెనీ కౌంటర్ లో గత కొన్ని రోజులుగా వాల్యూమ్స్ పెరగటంపై కూడా ఎక్స్ఛేంజ్ లు కూడా కంపెనీ వివరణ కూడా కోరాయి. పలు బ్రోకరేజ్ సంస్థలు ఈ షేర్ ధర 2350 రూపాయల వరకు వెళ్లే అవకాశం ఉంది అని ప్రకటించటం కూడా ఈ షేర్ కదలికకు కారణం గా చెపుతున్నారు. నోమురా సంస్థ ఈ షేర్లను కొనుగొలు చేయమని చెప్పి టార్గెట్ ప్రైస్ ను 2291 రూపాయలు గా వెల్లడించింది. దేశీయ సంస్థ అవేండస్ స్పార్క్ మాత్రం ఈ షేర్ ప్రైస్ టార్గెట్ 2350 రూపాయలు గా వెల్లడించింది. దీంతో పాటు ఈవీ మార్కెట్ లో కంపెనీ మంచి పట్టు సాధించే అవకాశం ఉండటం కూడా ఈ షేర్ల పెరుగుదలకు ఒక కారణంగా చెపుతున్నారు.

Next Story
Share it