Telugu Gateway
Top Stories

ఇంట్లోనే కాదు...విమానంలో కూడానా!

ఇంట్లోనే కాదు...విమానంలో కూడానా!
X

విమానాల్లో వివాదాలు చాలా కామన్ అయిపోయాయి. కాకపోతే ఇది వెరైటీ. ఈ సారి ఒక విమానంలో ఏకంగా భార్యా, భర్తలు కొట్టుకున్నారు. ఈ దెబ్బకు ఆ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. జర్మనీ లోని మ్యూనిచ్ నుంచి బ్యాంకాక్ వెళుతున్న లుఫ్తాన్సా విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విమానం ప్రయాణిస్తున్న సమయంలో భార్య, భర్తల మధ్య మాటల యుద్ధం జరిగింది..తర్వాత భర్త తనను బెదిరించాడు అంటూ పైలట్ కు ఫిర్యాదు చేసింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ఏటిసి)తో సంప్రదించి విమానాన్ని ఢిల్లీ లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.

తొలుత పాకిస్థాన్ లో ల్యాండ్ అవటానికి అనుమతి కోరారు. అయితే అక్కడ అనుమతి లభించలేదు. జర్మనీ కి చెందిన ఈ ప్రయాణికుడిని ఢిల్లీ విమానాశ్రయంలో దింపి వెళ్లిపోయారు. ప్రయాణికుడి అనుచిత ప్రవర్తన కారణంగా విమానాన్ని ఢిల్లీ లో దింపాల్సి వచ్చింది అని...ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు లుఫ్తాన్సా వెల్లడించింది. అయితే అనుచితంగా ప్రవర్తించిన ప్రయాణికుడిని ఢిల్లీ పోలీస్ లకు అప్పగించాలా...లేక అతను క్షమాపణ చెప్పినందుకు వేరే ఫ్లైట్ లో అతన్ని జర్మనీ పంపాలా అనే అంశంపై అధికారులు ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

Next Story
Share it