Telugu Gateway
Top Stories

ఏప్రిల్ టూ జూన్ ఇక అంతే

ఏప్రిల్ టూ జూన్ ఇక అంతే
X

వేసవిలో ఎండలు మంట మండించటం మామూలే. కాకపోతే ఈ సారి అది మరింత ఎక్కువ ఉంటుంది అని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అదే సమయంలో ఏయే రాష్ట్రాల్లో ఎండలు మరింత ఎక్కువ ఉంటాయో కూడా ముందే వెల్లడించింది. అందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్ర ప్రదేశ్ కూడా ఈ జాబితాలో ఉంది. ఏపీ తో పాటు గుజరాత్, మధ్య మహా రాష్ట్ర, ఉత్తర కర్ణాటక , మధ్య ప్రదేశ్ , ఒడిశా , ఉత్తర ఛత్తీస్ గఢ్ ప్రాంతాలు ఉన్నాయి. మర్చి నెలలోనే కర్ణాటకలో గతంలో ఎన్నడూ లేని రీతిలో రికార్డు ఉష్ణోగ్రతలు ఈ రాష్ట్రాల్లో వేడి గాలులతో పాటు ఎండలు కూడా తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

దేశంలో ఏప్రిల్ నుంచి జూన్ నెల వరకు ఎండలు తీవ్రత అదికాకంగా ఉండే అవకాశం ఉంది అని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ హిమాలయ ప్రాంతం, ఒడిశా ఉత్తర భాగంలో మాత్రం ఎండలు సాధారణం నుంచి ఒకింత గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కర్ణాటక తీవ్రమైన నీటి సమస్యను ఎదుర్కొంటోంది. రాబోయే రోజుల్లో మరిన్ని రాష్ట్రాల్లో కూడా నీటి సమస్య తలెత్తే అవకాశం ఉంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాతావరణంలో చోటు చేసుకునే మార్పులతో సీజన్స్ లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

Next Story
Share it