Telugu Gateway
Top Stories

ఫ్లైట్ లో గుర్రం గోల

ఫ్లైట్ లో గుర్రం గోల
X

విమానాల్లో కొంత మంది ప్రయాణికులు పెంపుడు జంతువులను కూడా తీసుకెళుతుంటారు. వాళ్లకు వాటితో ఉండే అనుబంధం అలాంటిది. అయితే అన్ని ఎయిర్ లైన్స్ పెంపుడు జంతువులను అనుమతించవు. ఎంపిక చేసిన ఎయిర్ లైన్స్ లోనే ఈ వెసులుబాటు ఉంటుంది. పెట్ డాగ్స్ తో పాటు ఇతర చిన్న చిన్న జంతువులను తీసుకెళ్లటం ఓకే కానీ..ఆ విమానంలో ఏకంగా గుర్రాన్నే ఎక్కించారు. అది కార్గో సెక్షన్ లో . అంతవరకు బాగానే ఉంది...విమానం 31 వేల అడుగుల ఎత్తుకు ఎగిరిన తర్వాత ఆ గుర్రం ఉండాల్సిన చోట కాకుండా వేరే చోటకు వెళ్ళింది. ఆ సమయంలోనే విమానం కుదుపులకు కూడా గురి అయింది. విషయం తెలుసుకున్న విమాన సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

వెంటనే విషయాన్నీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ఏటిసి) కి తెలియచేసి..అనుమతి తీసుకుని ఆ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానంలో ఇంధనం పెద్ద ఎత్తున ఉండటంతో ఏకంగా 20 టన్నుల ఫ్యూయల్ ను అట్లాంటిక్ సముద్రంలో వదిలేసి...ఆ తర్వాత విమానాన్ని సేఫ్ గా ల్యాండ్ చేశారు. ఎయిర్ అట్లాంటా ఐస్లాండిక్ ఎయిర్ లైన్స్ కు చెందిన కార్గో విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. న్యూ యార్క్ లోని జెఎఫ్ కె విమానాశ్రయం నుంచి బెల్జియం కు బయలుదేరిన 747 విమానంలో ఈ అనూహ్య సంఘటన జరిగింది. ఏటిసి కి సమాచారం ఇచ్చాక న్యూ యార్క్ విమానాశ్రయంలోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి....గుర్రాన్ని నియంత్రణలోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఆ గుర్రానికి గాయాలు అయినట్లు గుర్తించారు.

Next Story
Share it