Telugu Gateway
Top Stories

పార్కింగ్ స్పాట్...ఖ‌రీదు 9.6 కోట్ల రూపాయ‌లు

పార్కింగ్ స్పాట్...ఖ‌రీదు 9.6 కోట్ల రూపాయ‌లు
X

ఆశ్చ‌ర్యంగా ఉన్నా ఇది నిజం. అక్క‌డ ఓ పార్కింగ్ స్పాట్ ను 9.6 కోట్ల రూపాయ‌లు పెట్టి కొనుగోలు చేశారు. హాంకాంగ్ లోని మౌంట్ నిక‌ల్స‌న్ రెసిడెన్షియ‌ల్ ప్రాజెక్టులో ఈ డీల్ జ‌రిగింది. గ‌తంలో జ‌రిగిన 7.6 మిలియ‌న్ల హాంకాంగ్ డాల‌ర్ల డీల్ ను ఈ తాజా డీల్ 10.2 మిలియ‌న్ హాంకాంగ్ డాల‌ర్లు (9.60 కోట్లు) దాటేసింది. అదే భార‌త్ లో అయితే ప‌ది కోట్ల రూపాయ‌లు పెడితే ఓ రేంజ్ లో ప్రీమియం ప్లాటే వ‌స్తుంది. దానికి క‌నీసం మూడు పార్కింగ్ స్పాట్స్ ఇస్తారు.

కానీ ఓ పార్కింగ్ స్పాట్ కోసం ఏకంగా 9.6 కోట్ల రూపాయ‌లు పెట్టారంటే అక్క‌డ ప‌రిస్థితి ఏంటో ఊహించుకోవ‌చ్చు. హాంకాంగ్ లోనిమౌంట్ నిక‌ల్స‌న్ ఐకానిక్ ప్రాజెక్టుల్లో ఒక‌ట‌ని బ్లూమ్ బెర్గ్ వెల్ల‌డించింది. ల‌గ్జ‌రీ ఇళ్ల మార్కెట్ తిరిగి గాడిన ప‌డుతుంద‌నే న‌మ్మ‌కంతో చాలా మంది కొనుగోలుదారులు మ‌ళ్లీ రంగంలోకి దిగ‌టం ప్రారంభించార‌ని తెలిపారు. అక్క‌డ ప్రీమియం ఇళ్ళ ధ‌ర‌లు కూడా వంద‌ల కోట్ల రూపాయ‌ల్లోనే ఉంటాయి.

Next Story
Share it