Telugu Gateway
Top Stories

ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల్లో 41,177 ఉద్యోగాలు ఖాళీ

ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల్లో 41,177 ఉద్యోగాలు ఖాళీ
X

ఈ ఏడాది డిసెంబ‌ర్ నాటికి దేశంలోని ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల్లో 41,177 ఉద్యోగాలు ఖాళీగా ఉన్న‌ట్లు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ వెల్ల‌డించారు. మంజూరు అయిన పోస్టుల్లో వివిధ హోదాల్లో ఈ మేర ఖాళీలు ఉన్నట్లు లోక్ స‌భ‌లో ఇచ్చిన లిఖిత‌పూర్వ‌క స‌మాధానంలో వెల్ల‌డించారు. మొత్తం పీఎస్ బీల్లో 8,05,986 మంజూరు అయిన పోస్టులు ఉన్నాయ‌న్నారు. గ‌త ఆరేళ్ళ కాలంలో ఏ ఒక్క ఖాళీని కానీ,,పోస్టును కానీ రద్దు చేయ‌లేద‌న్నారు. అయితే ఒక్క పంజాయ్ అండ్ సింథ్ బ్యాంకు మాత్రం దీనికి మిన‌హాయింపు అన్నారు. అధికారిక గ‌ణాంకాల ప్ర‌కారం దేశంలోని అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బిఐ)లో నే అత్య‌ధికంగా 8544 పోస్టులు ఖాళీగా ఉన్నాయ‌న్నారు.

సిబ్బంది కొర‌త వ‌ల్ల బ్యాంకుల్లో సేవ‌ల‌కు అంత‌రాయం క‌లుగుతోంద‌ని..ఉన్న వారిపై అద‌న‌పు భారం ప‌డుతుందా అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానంగా మంత్రి ప‌లు విష‌యాలు వెల్ల‌డించారు. బ్యాంకుల్లో 95 శాతం సిబ్బంది ఉన్నార‌ని తెలిపారు. ఎస్ బిఐ త‌ర్వాత పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ లో 6743 ఖాళీలు, సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 6295 ఖాళీలు, ఇండియ‌న్ ఒవ‌ర్సీస్ బ్యాంకులో 5112, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 4848 ఖాళీలు ఉన్నాయి. బ్యాంకులు వారి అవ‌స‌రానికి అనుగుణంగా సిబ్బంది నియామ‌కానికి చ‌ర్య‌లు తీసుకుంటున్నాయ‌ని వెల్ల‌డించారు.

Next Story
Share it