Telugu Gateway
Top Stories

బర్గర్లు తినటానికి హెలికాప్టర్ లో 450 కిలోమీటర్లు

బర్గర్లు తినటానికి హెలికాప్టర్ లో 450 కిలోమీటర్లు
X

డబ్బు ఉంటే ఏమైనా చేయోచ్చు అనటానికి ఇది ఓ ఉదాహరణ. వాళ్లకు ఆర్గానిక్ ఫుడ్ తిని తినీ బోర్ కొట్టిందట. అందుకే బర్గర్లు తినాలనుకున్నారు. ఏకంగా హెలికాప్టర్ బుక్ చేసుకున్నారు. అందులో 450 కిలోమీటర్లు ప్రయాణించారు. విక్టర్ మార్ట్ నోవ్ అనే యువకుడు తన గర్ల్ ఫ్రెండ్ తో కలసి ఇలా ఫ్లై అయ్యాడు. విచిత్రం ఏమిటంటే వీళ్ళు బర్గర్ ఔట్ లెట్ లో ఖర్చు చేసింది భారతీయ కరెన్సీలో 4800 రూపాయలు. కాకపోతే వీళ్ళు హెలికాప్టర్ కు రానూపోనూ చెల్లించిన పీజు మాత్రం సుమారు రెండు లక్షల రూపాయలు.

ఈ పని చేసింది ఓ రష్యన్ మిలియనీర్. క్రిమియా ప్రాంతానికి వెకేషన్ కు వచ్చిన వీళ్ళు స్థానిక ఆహారం నచ్చక పనిచేశారు. ఈ వార్త రష్యా సోషల్ మీడియాలో పెద్ద వైరల్ గా మారింది. రష్యన్ మీడియా కూడా ఈ వార్తను ప్రముఖంగా ప్రచురించింది. క్రిమియా ప్రాంతంలో ఎలాంటి ఫాస్ట్ ఫుడ్ ఔట్ లెట్స్ లేకపోవటంతో వీరు ఈ పని చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వార్త చివరకు మార్ట్ నోవ్ వద్దకు కూడ చేరింది. మాస్కోలో ఓ హెలికాప్టర్లు అమ్మే కంపెనీ సీఈవో అయిన మార్టినోవ్ దీనిపై స్పందించారు కూడా. తాను..తన గర్ల్ ఫ్రెండ్ స్థానిక ఆర్గానిక్ ఫుడ్ తో ఇబ్బంది పడ్డామని..అందుకే ఈ పని చేశామని వెల్లడించారు.

Next Story
Share it