హర్దీప్ సింగ్ నోట మాంద్యం మాట
మాంద్యం. ఇప్పుడు పదే పదే విన్పిస్తున్న మాట. ఓ వైపు సింగపూర్ ప్రధాని లీ దగ్గర నుంచి అమెరికాకు చెందిన ప్రముఖ ఇన్వెస్ట్ మెంట్ సంస్థ గోల్డ్ మన్ శాక్స్ కూడా ఇదే ఆందోళన వ్యక్తం చేసింది. రష్యా-ఉక్రెయిన్ ల మధ్య కొనసాగుతున్న దీర్ఘకాల యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఇంథన బిల్లుల వ్యయం పెరుగుతోంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ద్రవ్యోల్భణం గణనీయంగా పెరుగుతోంది. అగ్రరాజ్యం అమెరికాలో సైతం గత 40 సంవత్సరాల్లో ఎన్నడూలేని రీతిలో ఆహార ఉత్పత్తుల ధరలు పెరిగాయి. పలు దేశాలు ఇదే బాటలో సాగుతున్నాయి. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇంథన దరలు బ్యారెల్ కు 110 డాలర్ల వద్ద కొనసాగటం ద్రవ్యోల్బణం పెరగటం కంట అత్యంత ప్రమాదకర పరిణామం అని వ్యాఖ్యానించారు. దావోస్ లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే రేట్ల వద్ద ఇంథన దరల కొనసాగితే పరిస్థితి మరింత ప్రమాదకరమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉందని..అప్పుడు మాంద్యం రావొచ్చని హింట్ ఇచ్చారు. ఇప్పటికే దేశంలో ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో పెరగ్గా..రాబోయే రోజుల్లో వడ్డీ రేట్లు కూడా మరింత పెరిగే అవకాశం స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడిని చూపించే పరిణామాలే.