Telugu Gateway
Top Stories

జీఎస్టీ మండ‌లి కీల‌క నిర్ణ‌యాలు

జీఎస్టీ మండ‌లి కీల‌క నిర్ణ‌యాలు
X


కేంద్రం ముందు నుంచి చెబుతున్న‌ట్లు క‌రోనా వ్యాక్సిన్ల‌పై మాత్రం జీఎస్టీ త‌గ్గించ‌లేదు. కాక‌పోతే చికిత్స‌లో ఉప‌యోగించే ప‌లు మందుల‌తోపాటు బ్లాక్ ఫంగ‌స్ చికిత్స‌కు ఉప‌యోగించే ఔష‌ధాల‌పై మాత్రం జీఎస్టీలో మార్పులు చేశారు. క‌రోనా వ్యాక్సిన్ల‌పై 5 శాతం జీఎస్టీ యధా విధిగా అమలవుతుందని కేంద్ర ఆర్ధిక శా మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ స్పష్టం చేశారు. తాజాగా చేసిన మార్పులు, మిన‌హాయింపులు ఈ సంవత్సరం సెప్టెంబర్‌ 30 వరకు అమ‌లులో ఉంటాయని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. శ‌నివారం నాడు జ‌రిగిన జీఎస్టీ మండ‌లి స‌మావేశంలో ఆంబులెన్స్‌లపై విధించే జీఎస్టీని 12 శాతానికి తగ్గించింది.

ఇప్పటివరకు ఇది 28శాతంగా ఉంది.అలాగే ఎలక్ట్రిక్ ఫర్నేసులు,టెంపరేచర్‌ తనిఖీపరికరాలపై 5శాతం జీఎస్టీని వసూలు చేయనున్నారు. దీంతోపాటు బ్లాక్‌ఫంగస్‌ చికిత్సలో వాడే ఆంఫోటెరిసిన్‌-బీపై జీఎస్టీ మినహాయింపు నివ్వడం విశేషం. వివిధ రాష్ట్రాల ఆర్థికమంత్రులు, ఇతర ముఖ్య అధికారులతో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలో శనివారం జరిగిన భేటీలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. జీఎస్టీ మండ‌లి స‌మావేశంలో తీసుకున్న కీల‌క నిర్ణ‌యాలు ఇవే..

టోసిలుజుమాబ్, యాంఫోటెరిసిన్ ఔషధాలపై పన్ను మినహాయింపు

రెమ్‌డెసివిర్‌పై జీఎస్టీ 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గింపు

మెడికల్‌ ఆక్సిజన్‌పై జీఎస్టీ 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గింపు

జనరేటర్లు, ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లపై జీఎస్టీ 12 నుంచి 5 శాతానికి తగ్గింపు

వెంటిలేటర్లపై జీఎస్టీ 12 నుంచి 5 శాతానికి తగ్గింపు

వ్యాక్సిన్లపై 5 శాతం జీఎస్టీ అమలు

Next Story
Share it