డీజిల్ కార్లపై నిషేధం
ఈ సిఫారసులను కేంద్ర కాబినెట్ ఆమోదించిన తర్వాతా అమల్లోకి వస్తాయి. దేశంలో వాతావరణాన్ని కాలుష్యం చేస్తున్న ఇంధనాల్లో డీజిల్ దే సింహభాగంగా నిపుణులు చెపుతున్నారు. 2024 నుంచి కేవలం సిటీల్లో ఎలక్ట్రిక్ రవాణా వాహనాలకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసేలా చూడాలన్నారు. కార్గో రవాణాకు కూడా రైల్వే తో పాటు గ్యాస్ ఆధారిత ట్రక్కులు ఎక్కువ వాడాలన్నారు. ఇప్పటికే దేశంలోని కీలక ఆటోమొబైల్ సంస్థలు అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీపై వేల కోట్ల పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్ లోకి వచ్చినా వీటి వాటా పెరగటానికి ఇంకా కొన్ని సంవత్సరాలు పడుతుంది అనే అంచనాలు ఉన్నాయి. ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల తయారీ వేగవంతం చేసేందుకు ఉద్దేశించిన ఫేమ్ స్కీం కింద ప్రోత్సాహకాలు పొడిగించే అంశాన్ని కేంద్రం పరిశీలించాలని కమిటీ కేంద్రాన్ని కోరింది.