సంపన్న భారతీయుడిగా గౌతమ్ అదానీ
BY Admin2 Jun 2024 4:55 PM IST
X
Admin2 Jun 2024 4:55 PM IST
అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఇప్పుడు దేశంలోనే సంపన్న భారతీయుడిగా అవతరించారు. ఆయన సంపద 111 బిలియన్ డాలర్స్ గా ఉంది. అంటే మన భారతీయ కరెన్సీ లో అయితే దగ్గర దగ్గర 9,21 ,300 కోట్ల రూపాయలు. ఇటీవల వరకు భారత్ లో నంబర్ వన్ సంపన్నుడిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఉంటే ఆయన ప్లేస్ ను గౌతమ్ అదానీ దక్కించుకున్నారు. అయితే అటు గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీల సంపద మధ్య వ్యతాసం కేవలం రెండు బిలియన్ డాలర్లు మాత్రమే. ముఖేష్ సంపద ప్రస్తుతం 109 బిలియన్ డాలర్లుగా ఉంది. వీళ్లిద్దరి తర్వాత 36 బిలియన్ డాలర్స్ తో షాపూర్ మిస్ట్రీ మూడవ స్థానంలో, 32 బిలియన్ డాలర్స్ తో సావిత్రి జిందాల్ నాల్గవ స్థానాల్లో నిలిచారు. 31 .6 బిలియన్ శివ్ నాడార్ ఐదవ స్థానంలో ఉన్నారు.
Next Story