Telugu Gateway
Top Stories

గూగుల్ సేవలకు అంతరాయం

గూగుల్ సేవలకు అంతరాయం
X

భారత్ లో గూగుల్ సేవలకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. అంతే ఒక్కసారిగా ఈ వ్యవహారం ట్రెండింగ్ గా మారిపోయింది. గూగుల్ కు చెందిన అన్ని సేవలతోపాటు యూట్యూబ్ కూడా కొద్దిసేపు నిలిచిపోయింది. అయితే సేవలు ఆగిపోయిన కొద్ది నిమిషాల్లోనే మళ్ళీ సేవలను పునరుద్ధరించటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ గూగుల్ సేవలపైనే ఆధారపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కోవిడ్ సమయంలో అంతా ఆన్ లైన్ పేనే లావాదేవీలు సాగుతున్నాయి.

జీమెయిల్‌, గూగుల్‌ హోం, గూగుల్‌ డ్రైవ్‌తో పాటు కొద్దిసేపు యూట్యూబ్ సేవలు నిలిచిపోయాయి. సర్వర్లు డౌన్‌ కావడంతో అన్ని ఆన్‌డ్రాయిడ్‌‌, ఐఓఎస్‌, డెస్క్‌టాప్‌లలో ఈ అప్లికేషన్ల సేవలు నిలిచిపోయాయి. సేవల అంతరాయంపై గూగుల్‌ స్పందించింది. కొన్ని సాంకేతిక లోపాల వల్ల సర్వర్లు డౌన్‌ అయ్యాయని, కాసేపట్లో సేవలను పునరుద్ధరిస్తామని తెలిపింది దాదాపు 20 నిమిషాల అంతరాయం తర్వాత గూగుల్ తన సేవలను‌ తిరిగి పునరుద్ధరించారు.

Next Story
Share it