Telugu Gateway

బంగారు ఫెరారీ కారు..అనంద్ మ‌హీంద్రా కీల‌క వ్యాఖ్య‌లు

బంగారు ఫెరారీ కారు..అనంద్ మ‌హీంద్రా కీల‌క వ్యాఖ్య‌లు
X

సంప‌న్నులు....సెల‌బ్రిటీలు చాలా మంది ఖ‌రీదైన కార్లు కొనుగోలు చేసి అది కూడా ఓ హోదాగా భావిస్తుంటారు. అత్యంత ఖ‌రీదైన కార్ల కొనుగోలుదారుల జాబితాలో త‌మ పేరు కూడా ఉన్నందుకు చూసి సంతోషిస్తుంటారు. ఎందుకంటే దేశంలో ఈ కార్లు ఉన్న‌ది ఓ ప‌ది మంది ద‌గ్గ‌రే..లేదంటే ఓ ఐదుగురి దగ్గ‌రే. అందులో వీళ్లు మాత్రమే ఉన్నారంటూ ఎన్నో వార్త‌లు వ‌స్తుంటాయి. అమెరికాలో ఉంటున్న ఓ భార‌తీయుడు బంగారు పెరారీ కారుతో అలాంటి హంగామానే చేశాడు. సోష‌ల్ మీడియాలో ఈ కారు వీడియో హ‌ల్ చల్ చేస్తోంది. ఈ వీడియోను ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త అనంద్ మ‌హీంద్రా కూడా షేర్ చేశారు. అంతే కాదు..దీనిపై ఆయ‌న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. నాకు అర్ధం కావ‌టంలేదు..ఇది సోష‌ల్ మీడియాలో అంత‌గా ఎందుకు తిరుగుతుందో.

సంప‌ద ఉన్నా.. డ‌బ్బులు ఎలా ఖ‌ర్చు పెట్ట‌కూడ‌దో ఇది ఓ పాఠంగా ఉండాల‌న్నారు. అమెరికాలో ఉంటున్న భార‌తీయ వ్య‌క్తి ఒక‌రు త‌న బంగారు ఫెరారీ కారుతో వీధుల్లోకి వ‌చ్చాడు. ఆ కారునే అంతా వింత‌గా చూస్తున్నారు. స‌హ‌జంగా ఫెరారీ కారే ఖ‌రీదైన‌ది. దానికి మ‌ళ్లీ బంగారం జోడించ‌టం అంటే అది మ‌రింత వ్య‌యంతో కూడుకున్న విష‌య‌మే. దీనిపై నెటిజ‌న్లు ర‌క‌ర‌కాల కామెంట్స్ చేస్తున్నారు. ఇలా బంగారు కారు ద్వారా ఆయ‌న ఏమి సాధించారో అర్ధం కావటంలేద‌ని ఓ సోష‌ల్ మీడియా యూజ‌ర్ వ్యాఖ్యానించారు. మ‌రి కొంత మంది షో ఆఫ్ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

Next Story
Share it