Telugu Gateway
Top Stories

బంగారం ధర మరింత తగ్గే ఛాన్స్?!

బంగారం ధర మరింత తగ్గే ఛాన్స్?!
X

భారతీయులకు ఉన్నంతగా బంగారంపై మోజు బహుశా మరే దేశంలో ఎక్కడ ఉండకపోవొచ్చు. ముఖ్యంగా భారతీయ మహిళలకు బంగారం అంటే ఎంతో ఇష్టం. ఒక ప్లాన్ ప్రకారం వీళ్ళు బంగారం కొనుగోలు చేస్తుంటారు. అమ్మాయిలు ఉన్న వాళ్ళు అయితే బంగారం పై మరింత ప్రత్యేక శ్రద్ద పెడతారు. మరికొంత మంది బంగారాన్ని పెట్టుబడి ఆప్షన్ గా కూడా ఎంచుకుంటారు. గత కొంత కాలంగా పెరుగుతూ..పెరుగుతూ పోయిన బంగారం ధర ఇప్పుడు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. సహజంగా ధర ఎప్పుడు పెరుగుతుంది...ఎప్పుడు తగ్గుతుంది అన్న అంశంపై ఎవరికీ స్పష్టత ఉండదు. బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎక్కువగా అంతర్జాతీయ అంశాలు ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా తో పాటు యునైటెడ్ కింగ్ డం , భారత్ వంటి దేశాలు అధిక ద్రవ్యోల్బణం తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఈ కారణంగా ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతుంది. ఉన్న డబ్బులు అన్ని అత్యవసర కొనుగోల్లుపైనే వెచ్చించాల్సి ఉంటుంది. పెరిగిన ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు దేశాలు అన్నీ వడ్డీ రేట్లు పెంచుకుంటూ పోతున్నాయి.

దీంతో ప్రజలపై మరింత భారం పడుతుంది. ప్రస్తుతం భారతీయ మార్కెట్ లో గరిష్ట ధరలతో పోలిస్తే పది గ్రాముల బంగారం ధర నాలుగు వేల రూపాయల మేర తగ్గింది. బంగారం తో పాటు వెండి ధర కూడా కిలో 8000 రూపాయల వరకు తగ్గుముఖం పట్టింది. రాబోయే రోజుల్లో బంగారం ధర మరింత తగ్గే అవకాశం ఉంది అని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో ఇప్పటికిప్పుడు బంగారం కొనుగోలుకు తొందర పడకూడదు అని...ధరలు మరింత తగ్గే ఛాన్స్ ఉన్నందున ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంది అని చెపుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక పరిస్థితి కూడా అంత ఆశాజనకంగా లేకపోవటం కూడా బులియన్ మార్కెట్ పై ప్రభావం చూపించే అంశమే. బంగారం ధర నిర్దారణలో అంతర్జాతీయ అంశాలు కీలకంగా ఉంటాయి. దీంతో పాటు డాలర్ విలువ కూడా మరో ముఖ్య అంశం.

Next Story
Share it