బంగారం ధర రికార్డు స్థాయికి

బులియన్ మార్కెట్ పై నిపుణుల అంచనాలు తప్పాయి. భారత్ లో బంగారం ధర తొలిసారి పది గ్రాములు అరవై వేల రూపాయలు దాటింది. ఇది తొలిసారి కావటం విశేషం. వాస్తవానికి కొద్ది రోజుల క్రితం బంగారం ధర తగ్గే అవకాశం ఉంది అని అంచనాలు వెలువడ్డాయి. అయితే ఇప్పుడు అందుకు బిన్నంగా ధరలు గణనీయంగా పెరిగాయి. అయితే బంగారం ధరలు పెరగటానికి ప్రధాన కారణం అంతర్జాతీయ పరిణామాలే కారణం అని చెపుతున్నారు. అమెరికాలో వరసపెట్టి బ్యాంకులు మూతపడటం..బంగారం ధర పెరుగుదలకు కారణంగా చెపుతున్నారు.
అమెరికాలో సిలికాన్ వ్యాలీ బ్యాంకు, సిగ్నేచర్ బ్యాంకు లు వరసగా మూతపడగా, మరికొన్ని తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన విషయం తెలిసిందే. యూఎస్ బ్యాంకింగ్ వ్యవస్థ లో నెలకొన్న సంక్షోభం ఇంకా మరింత పెరిగే అవకాశం ఉందనే అంచనాలు కూడా బంగారం డిమాండ్ పెరగటానికి కారణం అయింది అని చెపుతున్నారు. అయితే ఇది తాత్కాలికంగా..లేక ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగుతుందా అన్నది వేచిచుడాల్సిందే.



