Telugu Gateway
Top Stories

అంతర్జాతీయ సంస్థల అంచనాలు ఏంటి?!

అంతర్జాతీయ సంస్థల అంచనాలు ఏంటి?!
X

బంగారం ధరల్లో ఇటీవల భారీ ఊగిసలాట నెలకొంది. గత మూడున్నర నెలలుగా సాగిన అమెరికా, ఇరాన్ యుద్దానికి బ్రేకులు పడటంతో ఇప్పుడు మళ్ళీ బంగారం ధరలకు రెక్కలు వస్తున్నాయి. అయితే ఈ పెరుగుదల తాత్కాలికమా?. రానున్న రోజుల్లో ధరలు మరింత తగ్గుతాయా లేక పెరుగుతాయా అన్న చర్చ వివిధ వర్గాల్లో ఉంది. ఈ యుద్ధం కారణంగా విదేశీ మారక నిల్వలు కాపాడుకునేందుకు కేంద్రం బంగారం, వెండి పై దిగుమతి సుంకాన్ని ఆరు శాతం నుంచి ఏకంగా 15 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అంతే కాదు స్వయంగా ప్రధాని మోడీ బంగారం కొనుగోళ్లు వాయిదా వేయాలని కూడా దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. కారణాలు ఏమైనా కూడా ఇటీవల కాలంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఇప్పుడు మళ్ళీ ధరల పెరుగుదల మొదలైంది. అయితే ఇటీవల చోటు చేసుకున్న ధరల తగ్గుదల తాత్కాలికమే అని...ఈ సంవత్సరాంతం నాటికి ధరలు మరింత పెరగటం ఖాయం అని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

ఇటీవల దేశంలో బంగారం ధరలు ఏకంగా ఆరు నెలల కనిష్ట స్థాయికి చేరాయి. తర్వాత తిరిగి కోలుకున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ లో ట్రాయ్ ఔన్స్ బంగారం ధర 4348 డాలర్లుగా ఉంది. ఒక్క ట్రాయ్ ఔన్స్ అంటే 31 .1035 గ్రాముల బంగారం. 2026 చివరి నాటికి ట్రాయ్ ఔన్స్ బంగారం ధర గరిష్టంగా ఆరు వేల డాలర్లకు చేరే అవకాశం ఉంది అనే అంచనాలు వెలువడుతున్నాయి. అటు ఇన్వెస్టుమెంట్ కోసం అయినా అవసరం ఉన్న వాళ్ళు అయినా బంగారం ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేసి పెట్టుకోవటమే బెటర్ అని...కచ్చితంగా రాబోయే సంవత్సరాల్లో ధర పెరగటాని కే ఎక్కువ ఛాన్స్ ఉంది అని బులియన్ మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జె పీ మోర్గాన్ రీసెర్చ్ గరిష్టంగా ట్రాయ్ ఔన్స్ బంగారం ధర 6000 డాలర్లు చేరవచ్చు అని అంచనా వేసింది. గోల్డ్ మాన్ సాచ్స్ మాత్రం ఈ ధర 5400 డాలర్లుగా అంచనా వేసింది. ఇవి అన్నీ కూడా అప్పటి భౌగోళిక రాజకీయ పరిస్థితు లను బట్టి ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో పది గ్రాముల 24 క్యారెట్స్ బంగారం ధర 1,51,530 రూపాయలు ఉంది.

Next Story
Share it