Telugu Gateway
Top Stories

మిర్చి రైతుల కోసం అత్యాధునిక కీటక నివారిణి

మిర్చి రైతుల కోసం అత్యాధునిక కీటక నివారిణి
X

గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ (జీఏవిఎల్) అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తెగుళ్ల నివారణ మందు రషీన్‌బన్‌ ను మంగళవారం నాడు హైదరాబాద్ లో విడుదల చేసింది. జపాన్ కు చెందిన నిస్సాన్ కెమికల్ కార్పొరేషన్ అభివృద్ధి చేసిన ఈ ఉత్పత్తిని గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ భారతీయ మార్కెట్ లోకి తీసుకువచ్చింది. జపాన్ నుంచి దిగుమతి చేసుకుని దీన్ని జీఏవిఎల్ ఇక్కడ విక్రయించనుంది. రాబోయే రోజుల్లో దేశంలో జరిగే అమ్మకాల ఆధారంగా ఇక్కడ దీని ఉత్పత్తి చేయాలా లేదా అన్న అంశం ఆధారపడి ఉంటుంది అని కంపెనీ ఎండీ బలరాం సింగ్ యాదవ్ వెల్లడించారు. ఈ రషీన్‌బన్‌ ప్రధానంగా మొక్కలు పుష్పించే దశలో వచ్చే తెగుళ్ల నుంచి మంచి రక్షణ కల్పిస్తుంది అని వెల్లడించారు. ప్రధానంగా మిర్చి పంటతో పాటు అన్ని కూరగాయ పంటల రక్షణకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది అని తెలిపారు. ఏ పంటకైనా కాపు కాసే సమయంలో వచ్చే దశ ఎంతో కీలకం అని...దీన్ని కాపాడుకుంటే పంటలో విజయం సాధించవచ్చు అన్నారు.

దీనికి రషీన్‌బన్‌ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది అని వెల్లడించారు. రైతులకు ప్రధాన సమస్య పంట తెగుళ్లు అని..వీటిని అరికట్టడానికి ఈ మందు ఎంతో బాగా పని చేస్తుంది అని తెలిపారు. భారతీయ రైతులకు మెరుగైన ఉత్పత్తులు అందించేందుకు నిస్సాన్ కెమికల్ కార్పొరేషన్ తో కలిసి తాము సాగుతున్నాం అని బలరాం సింగ్ యాదవ్ వెల్లడించారు. మిర్చి తో పాటు సుగంధ ద్రవ్యాల ఎగుమతి విషయంలో భారత్ చాలా ముందు వరసలో ఉంది అని...ఆయా పంటలను కాపాడేందుకు రషీన్‌బన్‌ ఎంతగానో ఉపయోగ పడుతుంది అని భావిస్తున్నట్లు తెలిపారు. దేశ వ్యవసాయ ఉత్పత్తులను పెంచటంతో పాటు నాణ్యమైన ఉత్పత్తుల కోసం ఈ మందు ఎంతో తోర్పడనుంది అని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.

Next Story
Share it