Top
Telugu Gateway

గోవా పర్యాటక రంగానికి 7000 కోట్ల నష్టం!

గోవా పర్యాటక రంగానికి 7000 కోట్ల నష్టం!
X

గోవా. దేశంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ముందు వరసలో ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రదేశాల తరహాలోనే గోవా కూడా కోవిడ్ 19తో కకావికలం అయింది. ఒక్క లాక్ డౌన్ కారణంగానే గోవా ఏకంగా 1000 కోట్ల రూపాయల మేర ఆదాయాన్ని కోల్పోయిందని గోవా ఛాంబర్ ఆఫ్ కామర్స్ వెల్లడించింది. ఇదిలా ఉంటే గోవా పర్యాటక శాఖ , ఓ ప్రైవేట్ కన్సల్టెన్సీ నివేదిక ప్రకారం గోవా పర్యాటక రంగం ఏకంగా 2000 కోట్ల రూపాయల నుంచి 7200 కోట్ల రూపాయల మేర నష్టపోయినట్లు ఓ అంచనా. ఉద్యోగాల నష్టం 35 నుంచి 58 శాతం మేర ఉన్నట్లు తేల్చారు. ప్రస్తుతం గోవా పర్యాటక రంగానికి పీక్ సీజన్ .

అయినా సరే డిసెంబర్ 15 వరకూ కేవలం 50 శాతం మేర మాత్రమే రెస్టారెంట్లు, హోటళ్ళు ఓపెన్ చేశారు. అయితే చాలా వరకూ పర్యాటకులు భయం వీడి గోవాలో ఎంజాయ్ చేయటం ప్రారంభించారు. అయితే ప్రీ కోవిడ్ స్థాయిలకు రావటానికి మాత్రం ఇంకా సమయం పట్టే సూచనలు కన్పిస్తున్నాయి. తాజాగా బ్రిటన్ లో వెలుగుచూసిన కొత్త స్టెయిన్ కూడా మళ్ళీ దేశంలో ఒకింత భయాందోళనలను పెంచింది. వ్యాక్సిన్ అందుబాటులో వచ్చి సాధారణ పరిస్థితులు రావటానికి ఎంత సమయం పడుతుందనే అంశంపై ఇప్పటివరకూ స్పష్టత లేదు.

Next Story
Share it