Telugu Gateway

గోవా సన్ బర్న్ ఫెస్టివల్ రద్దు

గోవా సన్ బర్న్ ఫెస్టివల్ రద్దు
X

నూతన సంవత్సరం సందర్భంగా గోవాలో ఉండే సందడే వేరు. దేశంలోని పలు ప్రాంతాల్లోని యూత్ కొత్త సంవత్సర వేడుకల కోసం గోవా వెళతారు. అక్కడ ప్రతి ఏటా 'సన్ బర్న్ ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్ (ఈడీఎం) ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఆసియాలోనే ఇది అతి పెద్ద మ్యూజిక్ ఫెస్టివవల్ గా నిలుస్తుంది. ఈ సారి ఆ ఛాన్స్ లేదు. తాజాగా గోవా ప్రభుత్వం సన్ బర్న్ కు ఇచ్చిన అనుమతిని రద్దు చేసింది. కరోనా కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. తొలుత ప్రభుత్వం సన్ బర్న్ ఈవెంట్ కు అనుమతి ఇవ్వటంతో కాంగ్రెస్ తోపాటు ఇతర పార్టీల కార్యకర్తలు ఆందోళనలకు దిగారు.

తొలుత డిసెంబర్ 27-29 తేదీల్లో ఈ మ్యూజిక్ ఫెస్టివల్ నిర్వహించాలని ప్రతిపాదించారు. ఈ కార్యక్రమానికి పది వేల మంది హాజరు అవుతారని నిర్వాహకులు అంచనా వేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సారి తాము సన్ బర్న్ కు ఇచ్చిన అనుమతిని రద్దు చేసినట్లు గోవా పర్యాటక శాఖ మంత్రి మనోహర్ అజ్ గోంకర్ వెల్లడించారు. అయితే ప్రస్తుతం గోవాలో కరోనా కేసులు పరిమితంగా ఉండటంతో పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ప్రతి ఏటా ఈ సీజన్ లో గోవా సందడి సందడిగా ఉండేది. అయితే ప్రస్తుతం మాత్రం అది మిస్ అయిందని చెబుతున్నారు.

Next Story
Share it