Telugu Gateway
Top Stories

మెల్ల‌గా వెళ్లండి..ముందు బార్ ఉంది!

మెల్ల‌గా వెళ్లండి..ముందు బార్ ఉంది!
X

మందు బాబుల‌ను ప్ర‌భుత్వాలే కాదు..బార్ యాజ‌మానులు కూడా చాలా జాగ్ర‌త్త‌గా చూసుకుంటున్నారు. అందుకు ఉదాహ‌ర‌ణే ఈ బోర్డు. మెల్ల‌గా వెళ్లండి..ముందు బార్ ఉంది అంటూ ఓ రోడ్డు ప‌క్క‌న ఇలా బోర్డు పెట్టారు. అంటే బార్ కోసం వెతుకులాడుకోవాల్సిన అవ‌స‌రం లేకుండా ఇలా ఏర్పాటు చేశార‌న్న మాట‌. స‌హ‌జంగా మనం రోడ్ల‌పై పోతున్న‌ప్పుడు స్పీడ్ బ్రేక‌ర్లు ఉన్నాయి జాగ్ర‌త్త‌..భారీ మ‌లుపులు ఉన్నాయి జాగ్ర‌త్త అంటూ హెచ్చ‌రిక‌ బోర్డులు చూస్తుంటాం. కానీ విచిత్రంగా ముందు బార్ ఉంది..మెల్ల‌గా వెళ్లండి అంటూ వెల‌సిన ఈ బోర్డు కేర‌ళ‌లోనిది. కేర‌ళ అంటే నిత్యం ప‌ర్యాట‌కుల‌తో క‌ళ‌క‌ళ‌లాడే ప్రాంతం అన్న విష‌యం తెలిసిందే. పర్యాట‌కుల సౌల‌భ్యం కోస‌మే ఇది ఏర్పాటు చేసిన‌ట్లు క‌న్పిస్తోంది. ఈ ఫోటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

Next Story
Share it