Telugu Gateway
Top Stories

శంషాబాద్ విమానాశ్రయం@ అద్దెకు విలాసమైన కార్లు

శంషాబాద్ విమానాశ్రయం@ అద్దెకు విలాసమైన కార్లు
X

చాలా మందికి ఒక్కసారైనా విలాసవంతమైన కార్లు నడపాలని ఉంటుంది?. కానీ కోట్ల రూపాయల విలువ చేసే ఈ కార్లు అందుబాటులో ఉండటం సాధ్యం కాదు. పోనీ ఎవరి దగ్గరైనా అలాంటి కార్లు ఉన్నా ..అలా రౌండ్ అలా వెళ్లొస్తామంటే ఇచ్చే కార్లు కూడా కావు అవి. ఎందుకంటే వాటి ఖరీదే ఆ స్థాయిలో ఉంటుంది మరి. కానీ ఇప్పుడు విలాసవంతమైన కార్లను ఓ సారి అయినా నడపాలి...లేదా అందులో సరదాగా ఓ రౌండ్ వేయాలి అనుకునే వారికి ఓ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇప్పుడు ఈ కార్లు అద్దెకు లభించనున్నాయి. ఈ విషయాన్ని జీఎంఆర్ విమానాశ్రయం ఓ ప్రకటనలో వెల్లడించింది. దేశంలోనే మొదటిసారి ఇలాంటి సౌకర్యం హైదరాబాద్ లోని జీఎంఆర్ విమానాశ్రయంలో అందుబాటులోకి వచ్చిందని తెలిపారు.

హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అరైవల్స్ వద్ద ఉన్న 4 వీల్ సంస్థ అసమానమైన లగ్జరీ కార్లను అందిస్తోంది. Porsche 911 Carrera 4S, జాగ్వార్ ఎఫ్ టైప్, లంబోర్ఘిని గల్లార్డో, లెక్సస్ ఇఎస్ 300 హెచ్, ఆడి ఎ 3 క్యాబ్రియోలెట్, మెర్సిడెస్ బెంజ్ ఇ 250, బిఎమ్‌డబ్ల్యూ 3 జిటి, బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్, ఫోర్డ్ ముస్తాంగ్, వోల్వో ఎస్ 60, మసెరాటి ఘిబ్లి, టయోటా ఫార్చ్యూనర్, మారుతి సుజుకి సియాజ్ లాంటి అత్యాధునికమైన కార్లు కేవలం ఫోన్ కాల్ / క్లిక్ దూరంలో ఉన్నాయి. ఈ కార్లను అద్దెకు తీసుకున్నవారు వాటిని తామే సొంతంగా నడుపుకోవచ్చు లేదా డ్రైవర్ కూడా అందుబాటులో ఉంటాడు. అంతే కాకుండా హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగడానికి ముందే వీటిని బుక్ చేసుకోవచ్చు. ప్రయాణికుల భద్రత కోసం ప్రతి ట్రిప్ తర్వాత కార్లును శానిటైజ్ చేస్తారని తెలిపారు.

Next Story
Share it