Telugu Gateway
Top Stories

అమెరికాలో న్యాయం జరిగిన రోజు

అమెరికాలో న్యాయం జరిగిన రోజు
X

ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు సంబంధించిన కేసులో అమెరికా కోర్టు తీర్పు వెలువరించింది. ఫ్లాయిడ్ మృతికి మిన్నియా పోలీస్ మాజీ అధికారి డెరెక్ చౌవిన్ కారణం అని కోర్టు వెల్లడించటంతో పాటు ఆయన దోషే అని పేర్కొంది. ఆఫ్రికక్-అమెరికన్ అయిన జార్జ్ ఫ్లాయిడ్ ను పోలీసు అధికారు ఊపిరి ఆడటం లేదని చెబుతున్నా..ఆయన మెడపై బలంగా కాలిపెట్టి ఉంచిన దృశ్యాలు అప్పట్లో కలకలం రేపాయి. ఈ కారణంగానే ఫ్లాయిడ్ మరణించాడు. ఈ ఘటనను థర్డ్ డిగ్రీ హత్యగా కోర్టు తీర్పు వెలువరించింది. అయితే శిక్షను త్వరలో ప్రకటించనున్నారు. జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు సంబంధించి డెరిక్ తో పాటు మరో ముగ్గురు అధికారులపై అభియోగాలు ఉన్నాయి.

వీరి విచారణ ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది. ఇది ఆగస్టులో జరగనుంది. ఈ హత్యకు సంబంధించి కోర్టు తీర్పు వెలువడిన వెంటనే జార్జ్ కుటుంబ సభ్యులను బైడెన్, హ్యారిస్ లు శ్వేతసౌధానికి పిలిపించి మాట్లాడారు. ఈ సందర్భంగానే అమెరికా అధ్యక్షుడు జో బెడైన్. ఉపాధ్యక్ష్యురాలు కమలా హ్యారిస్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో న్యాయం జరిగిన రోజు అని వ్యాఖ్యానించారు. నకిలీ నోట్ల సరఫరా చేశారనే ఆరోపణలపై పోలీసులు జార్జ్ ఫ్లాయిడ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పుడే రోడ్డుపై పడేసి మెడపై మోకాలితో తొక్కిపెట్టారు. ఆ సమయంలో జార్జ్ ఎంత వేడుకున్నా కూడ పోలీసు అధికారి కనికరించలేదు.

Next Story
Share it