అమెరికాలో వాళ్ళకు మాస్క్ లు అక్కర్లేదు

వ్యాక్సిన్ వేసుకున్న పౌరులకు అమెరికా శుభవార్త చెప్పింది. ఈ మేరకు సెంటర్స్ పర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) పలు మార్గదర్శకాలు జారీ చేసింది. రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న వారు ఇండోర్స్ లో వ్యాక్సినేషన్ పూర్తయిన వారితో జరిగే భేటీలకు వెళ్ళొచ్చని..ఆ సమయంలో మాస్క్ కూడా ధరించాల్సిన అవసరం కూడా ఉండదన్నారు. ఒక్కరే ఉన్న ప్రాంతానికి వ్యాక్సినేషన్ పూర్తి అయిన వారు ఇండోర్ సమావేశాలకు కూడా వెళ్లొచ్చని..అక్కడ కూడా రిస్క్ తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు.
భారీ జనసమ్మర్ధం ఉండే ప్రాంతాలు తప్ప మిగిలిన చోట్ల మాత్రం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న వారు మాస్క్ లు లేకుండా ప్రయాణించవచ్చన్నారు. తొలిసారి సీడీసీ ఈ మార్గదర్శకాలను వెల్లడించింది. దేశీయ ప్రయాణాలు కూడా చేయవచ్చన్నారు. పర్యటనలకు ముందు..పర్యటనల తర్వాత కూడా పరీక్షలు చేయించుకోకూడదని తెలిపారు. విదేశీ పర్యటనలకు వెళితే ఆయా దేశాల్లో ఉన్న నిబంధనలు పాటిస్తే సరిపోతుందని పేర్కొన్నారు.