Telugu Gateway
Top Stories

బ్యాంకాక్ విమానాశ్రయం కిటకిట

బ్యాంకాక్  విమానాశ్రయం కిటకిట
X

పంచ వ్యాప్తంగా పర్యాటకులు ఇప్పుడు థాయిలాండ్ వైపు క్యూ కట్టారు దీంతో ఆ దేశంలోని బ్యాంకాక్ విమానాశ్రయం కిట కిట లాడుతోంది. భారత్ నుంచి బ్యాంకాక్ వెళ్లే వాళ్ళు దేశంలోనే కాన్సులేట్ లేదా ఎంబసిల వద్ద వీసాలు తీసుకోవాలని భారత్ లోని థాయిలాండ్ అంబాసడర్ పట్టరాత్ హొంగ్టన్గ్ వెల్లడించారు. దీని వల్ల విమానాశ్రయంలో గంటల కొద్దీ క్యూ లో వేచి ఉండాల్సిన అవసరం ఉండదని తెలిపారు. ఎక్కువ మంది వీసా ఆన్ అరైవల్ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. దీంతో విమానాశ్రయంలో ఎక్కువ సమయం వేచి చూడాల్సి వస్తోంది. 2022 జనవరి-ఆగష్టు కాలంలో థాయిలాండ్ కు 37 లక్షల మందికి పైగా పర్యాటకులు వెళ్లారు.

పెరుగుతున్న సంఖ్యకు అనుగుణంగా విమానాశ్రయంలో సిబ్బందిని పెంచినా కూడా క్యూ లు పెద్దగా ఉంటున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. ముందుగానే వీసా తీసుకుని పర్యటన చేస్తే ఈజీగా ఉంటుందని తెలిపారు. ఇమ్మిగ్రేషన్ వద్ద సమయం పట్టడం ప్రతి విమానాశ్రయంలోని సహజమే అని..అందుకు తాము కూడా మినహాయిపు కాదన్నారు. ఎంత మంది వస్తున్నారు అనే లెక్కలు ఊహించటం సాధ్యం కాదని తెలిపారు. థాయిలాండ్ ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా పర్యాటకుల మీదే ఆధారపడి ఉంటుంది అనే విషయం తెలిసిందే. డిసెంబర్ నెలతో పాటు కొత్త ఏడాది సందర్భంగా ఎక్కువ మంది బ్యాంకాక్ వైపు టూర్ పెట్టుకుంటారు.

Next Story
Share it