Telugu Gateway
Top Stories

రోహతాంగ్ పాస్ సందర్శన

రోహతాంగ్ పాస్ సందర్శన
X

మండు వేసవి లో కూడా దేశంలోని కొన్ని చోట్ల చలితో వణికించే ప్రాంతాలు ఉన్నాయి. ముఖ్యంగా వేసవిలో ఈ ప్రాంతాలను సందర్శించి చాలా మంది సేద తీరుతుంటారు. దేశంలోని అలాంటి ప్రాంతాల్లో హిమాచల్ ప్రదేశ్ లోని మనాలి ఒకటి. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎండలు మంటలు మండిస్తుంటే మనాలిలో మాత్రం మే నెలలో కూడా చలి తో వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. అందుకే పర్యాటకులు ఎక్కువగా సమ్మర్ లో మనాలి ని సందర్శిస్తారు. మనాలి లో పర్యాటకులకు అద్భుత అనుభూతిని కల్గించే ప్రాంతాలు చాలానే ఉన్నాయి. ఒక్కో ప్రాంతానిది ఒక్కో ప్రత్యేకత. ముఖ్యంగా ప్రకృతి ప్రేమికులకు నచ్చే ప్రదేశం ఇది. మనాలి ఉన్న కీలక ప్రాంతనాలు అన్నీ చూడాలి అంటే చాలా సమయమే పడుతుంది.

అయితే మనాలికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న రోహతాంగ్ పాస్ సందర్శన పర్యాటకులకు లైఫ్ టైం బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ ను సందర్శించిన ఫీలింగ్ ను ఇస్తుంది. సముద్ర మట్టానికి 13000 అడుగుల ఎత్తులో ఉండే ఈ ప్రాంతం మొత్తం మంచు కొండలతో నిండిపోయి ఉంటుంది. ముందు రోహతాంగ్ పాస్ కు చేరుకునే ఘాట్ రోడ్ లో ప్రయాణం...ఈ సమయంలో కనిపించే అద్భుత దృశ్యాలే వావ్ అనిపిస్తాయి. ఫైనల్ గా రోహతాంగ్ పాస్ కు చేరుకున్న తర్వాత మంచు గుట్టలతో కూడిన ఈ ప్రాంతం చూసి ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే అక్కడ ఉండే అద్భుత దృశ్యాలు అలా ఉంటాయి మరి. రోహతాంగ్ పాస్ కు చేరుకునే సమయంలో రోడ్ కు ఇరు వైపులా కూడా కట్ చేసిన మంచు గడ్డలతో కూడిన ప్రాంతాలు పర్యాటకులకు స్వాగతం పలుకుతున్నట్లు కనిపిస్తాయి.

ఇది ఒక్కటే కాదు ఈ ప్రాంతంలో ఎన్నో అద్భుతాలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. మనాలి నుంచి ప్రత్యేక వాహనాల్లో రోహతాంగ్ పాస్ కు వెళ్లొచ్చు. దీనికోసం ఒక్కొక్కరి నుంచి ప్రైవేట్ వాహనాల్లో 700 రూపాయల నుంచి వెయ్యి రూపాయల ఛార్జ్ వసూలు చేస్తారు. ఒక్కో సారి రోహతాంగ్ పాస్ లో మంచు వర్షం కూడా పర్యాటకులను ఆకట్టుకుంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులతో రోహతాంగ్ పాస్ ఏరియా మే నెలలో ఫుల్ రద్దీగా మారిపోతుంది. అయితే ఒక్కో సారి ఈ రోడ్ ప్రాంతాన్ని క్లోజ్ చేస్తారు కూడా. ముందుగా చెక్ చేసుకుని వెళితేనే పర్యటన సాఫీగా సాగుతుంది.

Next Story
Share it