Telugu Gateway
Top Stories

మహిళలకు మెట్రోలో ఉచిత ప్రయాణం..ఎల్ఆర్ఎస్ రద్దు

మహిళలకు మెట్రోలో ఉచిత ప్రయాణం..ఎల్ఆర్ఎస్ రద్దు
X

ఉచిత ట్యాబ్ లు..వంద యూనిట్లలోపు ఉచిత విద్యుత్

జీహెచ్ఎంసీలో ఉచితంగా కరోనా వ్యాక్సిన్

బిజెపి మేనిఫెస్టోలో వరాల జల్లు

తెలంగాణలో దూకుడు మీద ఉన్న బిజెపి జీహెచ్ఎంసీ మేనిఫెస్టోలోనూ అదే తీరు చూపించింది. భాగ్యనగర ప్రజలను ఆకట్టుకునేందుకు పలు వరాలు ప్రకటించిది. ఇందులో ఓటర్లను ఆకర్షించుకునే అంశాలు చాలానే పొందుపర్చారు. ఇది అమలు సాధ్యం అవుతుందా..లేదా అన్న సంగతి పక్కన పెడితే వరాలు మాత్రం ఆకట్టుకునేలా ప్రకటించారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవంద్ర ఫడ్నవిస్‌ గురువారం పార్టీ మేనిఫెస్టోను ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విడుదల చేశారు. బీహార్‌ అసెంబ్లీ సందర్భంగా ఇచ్చిన ఉచిత కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ ప్రయోగాన్ని ఇక్కడ కూడా అమలు చేయాలని బిజెపి నిర్ణయించింది.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలిస్తే హైదరాబాద్‌ ప్రజలందరికీ ఉచిక కరోనా టీకాను అందిస్తామని హామీనిచ్చింది. అంతేకాకుండా విద్యార్ధులకు ఉచితంగా ట్యాబ్స్‌, ఫ్రీ వైఫై సదుపాయాన్ని ఇస్తామంది. మహిళలకు బస్సులు, మెట్రోలో ఉచిత ప్రయాణం కల్పిస్తామని బీజేపీ హామీనిచ్చింది. అందరి ఆకాంక్షలు నెరవేర్చే విధంగా మేనిఫెస్టో ఉంటుందని ఫడ్నవిస్‌ అన్నారు. పేద బడుగు బలహీన మధ్య తరగతి వర్గాలకు చెందిన విధంగా మేనిఫెస్టో రూపొందించ బడిందని పేర్కొన్నారు. మార్పు కోసం జనం.జనం కోసం బిజెపి నినాదంతో మేనిఫెస్టోను తెచ్చింది.

బిజెపి మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు..

బిజెపి అదికారంలోకి వస్తే అధికారికంగా సెప్టెంబర్ 17ని విమోచన దినోత్సవంగా అమలు చేస్తాం.

ఎల్ఆర్ఎస్ రద్దు

25 వేల రూపాయల వరద సాయం

లంచాలు లేని జీహెచ్ఎంసీ

ఇంటింటికి నల్లా కనెక్షన్..24 గంటల ఉచిత నీటి సరఫరా

మహిళలకు బస్సులు, మెట్రోలో ఉచిత ప్రయాణం

గ్రేటర్‌లో బీజేపీ గెలిస్తే.. హైదరాబాద్‌లో అందరికీ ఉచితంగా కరోనా టీకాలు

బస్తీల్లో వందశాతం ఆస్తి పన్ను మాఫీ, ఎల్ఆర్ఎస్ రద్దుతో15 వేల కోట్ల భారం ప్రజలపై పడకుండా విముక్తి

ప్రధానమంత్రి అవాస్ యోజన కింద అందరికి గృహ నిర్మాణాలు

ఆన్‌లైన్‌ క్లాస్‌లకు ఉచిత ట్యాబ్లు

ప్రయివేటు స్కూల్స్‌ లో ఫీజుల నియంత్రణ

మూసి ప్రక్షాళన..10 వేల కోట్లతో సుమేధ కొత్త చట్టం

సుమేధ ద్వారా నాలల నిర్మాణం అక్రమ కట్టడాలు కూల్చివేత

పేదలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్

మహిళల కోసం కిలోమీటరుకో టాయిలెట్

గ్రేటర్ పరిధిలో టూవీలర్లు, ఆటోలపై ఇప్పటివరకు ఉన్న చలాన్లు రద్దు

గ్రేటర్‌లో ఇంటింటికి నల్లా కనెక్షన్.. 24 గంటలు ఉచితంగా మంచినీరు సరఫరా

కులవృత్తులకు ఉచిత విద్యుత్ ఎస్సీ కాలనీలు, బస్తీల్లో ఆస్తిపన్ను మాఫీ

కొత్త మహిళా స్టేషన్ల ఏర్పాటు, అతి పెద్ద తెలుగు లైబ్రరీ, మల్టీలెవల్ పార్కింగ్ సెంటర్లు

28 వేల కొత్త నియామకాలు, గుంతలు పడితే 15 రోజుల్లో రిపేర్, హైదరాబాద్ లో కరెంట్ చౌర్యానికి చెక్,

Next Story
Share it