Telugu Gateway
Top Stories

ఎల్ఐసీ పాల‌సీదారుల‌కు ఉచిత క్రిడిట్ కార్డులు

ఎల్ఐసీ పాల‌సీదారుల‌కు ఉచిత క్రిడిట్ కార్డులు
X

త్వ‌ర‌లోనే ఐపీవోకు రానున్న ప్ర్ర‌ముఖ ప్ర‌భుత్వ రంగ బీమా సంస్థ ఎల్ ఐసి ప్ర‌చార జోరు పెంచింది. అంతే కాదు..కొత్త కొత్త ఆఫ‌ర్ల‌తో పాల‌సీదారుల‌ను మ‌రింత ఆక‌ట్టుకునే ప‌నిలో ఉంది. అందులో భాగంగా ఎల్ ఐసీ ఖాతాదారుల‌కు, ఏజెంట్ల‌కు ఎలాంటి రుసుం లేకుండా ఉచితంగానే క్రెడిట్ కార్డులు జారీ చేయ‌నుంది. ఐడీబీఐ బ్యాంక్ సహకారంతో ఎల్ఐసీ సీఎస్ఎల్ ఇటీవల రూపే క్రెడిట్ కార్డును ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రెడిట్ కార్డును లుమైన్ కార్డు, ఎక్లాట్ కార్డుల పేరుతో అందుబాటులోకి తెచ్చింది. ఈ క్రెడిట్ కార్డులు ప్రస్తుతం ఎల్ఐసీ ఏజెంట్లు, సభ్యులు, పాలసీదారులకు ప్రత్యేకంగా ఇస్తుంది. త్వరలో ఈ కార్డులను ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని యోచిస్తోంది. ఈ కార్డు ద్వారా ఎల్ఐసీ ప్రీమియం చెల్లించినట్లయితే రెట్టింపు రివార్డ్ పాయింట్లను పొంద‌నున్న‌ట్లు తెలిపింది.

పెట్రోల్ బంకుల వద్ద ఫ్యూయల్ సర్‌ఛార్జ్ మినహాయింపు కూడా ఉంటుంది. ఈ కార్డులకు ఎలాంటి మెంబర్‌షిప్ ఫీజులు కానీ లేదా వార్షిక‌ ఫీజులు కానీ చెల్లించాల్సివసరం లేదు. లూమిన్ కార్డుపై రూ.100 ఖర్చు చేస్తే 3 డిలైట్ పాయింట్లను మీరు పొందవచ్చు. ఎక్లాట్ క్రెడిట్ కార్డుపై రూ.100 ఖర్చు చేస్తే 4 డిలైట్ పాయింట్లు వస్తాయి. ఎల్ఐసీ ఐడీబీఐ ఎక్లాట్ కార్డు హోల్డర్స్‌కు దేశీయ, అంతర్జాతీయ విమానశ్రయాల్లో కాంప్లిమెంటరీ లాంజ్ యాక్సస్ కూడా లభిస్తుందని తెలిపారు. ఈ క్రెడిట్ కార్డులకు కూడా యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఉంది. రూ.5 లక్షల వరకు సమ్ అస్యూర్డ్ లభిస్తుందన్నారు. లూమిన్ క్రెడిట్ కార్డు లిమిట్ రూ. 50వేలు గాను, ఎక్లాట్ క్రెడిట్ కార్డు లిమిట్ రూ.2 లక్షలుగా ఉంది. ఈ రెండు క్రెడిట్ కార్డుల వ్యాలిడిటీ 4 ఏళ్లుగా నిర్ణ‌యించారు.

Next Story
Share it