Telugu Gateway
Top Stories

జూన్ లో ఎఫ్ పిఐల అమ్మ‌కాలు 50,203 కోట్లు

జూన్ లో ఎఫ్ పిఐల అమ్మ‌కాలు 50,203 కోట్లు
X

భార‌తీయ స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ పోర్ట్ పోలియో ఇన్వెస్ట‌ర్లు (ఎఫ్ పిఐ) గ‌త కొంత కాలంగా నిక‌ర అమ్మ‌కందార్లుగా ఉన్నారు. అమెరికాలో వ‌డ్డీ రేట్లు ఇటీవ‌ల కాలంగా అనూహ్యంగా పెరుగుతుండటం ఒకటైతే...ద్ర‌వ్యోల్భ‌ణం కూడా కొత్త రికార్డులు న‌మోదు చేస్తోంది. 2022 జూన్ లో ఎఫ్ పిఐల ఏకంగా 50203 కోట్ల రూపాయ‌ల నిక‌ర అమ్మ‌కాలు జ‌రిపారు. గ‌త రెండేళ్ళ కాలంలో ఇదే రికార్డు స్థాయి అమ్మ‌కాలుగా ఉన్నాయి. 2022 సంవ‌త్స‌రం మొద‌టి ఆరు నెల‌ల కాలంలో ఎప్ ఐపిలు ఏకంగా 2.2 ల‌క్ష కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డులు ఉప‌సంహ‌రించుకున్నారు. స్వ‌ల్ప‌కాలంలో ఎఫ్ పిఐల పెట్టుబ‌డులు తీవ్ర ఒడిదుడుల‌కు లోన‌య్యే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

Next Story
Share it