Telugu Gateway
Top Stories

న‌ల‌భై మూడు సంవ‌త్స‌రాల్లో..53 పెళ్లిళ్లు!

న‌ల‌భై మూడు సంవ‌త్స‌రాల్లో..53 పెళ్లిళ్లు!
X

చాలా మంది పెళ్లి చేసుకుంటే చాలా క‌ష్టాలు వ‌స్తాయంటారు. దీనిపై స‌ర‌ద‌గా చాలా సినిమాలు కూడా వ‌చ్చాయి. కానీ ఈ వ్య‌క్తి ఏకంగా 43 సంవ‌త్స‌రాల్లో 53 పెళ్ళిళ్లు చేసుకున్నాడంట‌. అది కూడా ప్ర‌శాంత‌త‌..స్థిరంగా ఉండేందుకే ఇన్ని పెళ్లిళ్లు చేసుకున్న‌ట్లు ఆయ‌న చెబుతున్నారు. అంతే కానీ వ్య‌క్తిగ‌త సుఖం కోసం కాదట‌. సౌదీకి చెందిన ఆ వ్య‌క్తి ఈ విష‌యాల‌ను స్వ‌యంగా ఆ దేశ ఛాన‌ల్ కు వెల్ల‌డించారు. వ్యాపార ప‌ర్య‌ట‌న‌ల కోసం విదేశాల్లో ప‌ర్య‌టించిన‌ప్పుడు విదేశీయుల‌ను కూడా పెళ్ళి చేసుకున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.

తొలి పెళ్లి 20 సంవ‌త్స‌రాల వ‌య‌స్సులో చేసుకున్న‌ట్లు అబు అబ్దుల్లా వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం ఆయ‌న వ‌య‌స్సు 63 సంవ‌త్స‌రాలు. మొద‌టి భార్య‌తో విభేదాలు రావ‌టంతో 23వ‌ సంవ‌త్స‌రంలో రెండ‌వ పెళ్లి చేసుకున్నాడంట‌. మొద‌టి..రెండ‌వ భార్య‌ల మ‌ధ్య విభేదాలు రావ‌టంతో వాళ్ల‌కు విడాకులు ఇచ్చి మ‌ళ్లీ పెళ్ళి చేసుకున్నాన‌ని తెలిపాడు. ఇలా వ‌ర‌స‌గా పెళ్లిళ్లు చేసుకుంటూ వెళ్లి పెళ్లిళ్ల రికార్డును న‌మోదు చేశాడు. ఈ పెళ్లిళ్ల వార్త‌పై నెటిజ‌న్లు వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు. ఒక్క పెళ్ళికే ఇబ్బందులు ప‌డుతుంటే ఆయ‌న 53 పెళ్లిళ్లు ఎలా చేసుకున్నాడురా బాబోయ్ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

Next Story
Share it