Telugu Gateway
Top Stories

అనుమానాలున్నా ఆస్పత్రిల్లో చేర్చుకోవాల్సిందే

అనుమానాలున్నా ఆస్పత్రిల్లో చేర్చుకోవాల్సిందే
X

కరోనా చికిత్సకు సంబంధించి కేంద్రం కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకూ కోవిడ్ 19 పాజిటివ్ గా తేలిన వారికి మాత్రమే ఆస్పత్రుల్లో చేర్చుకుని చికిత్స అందిస్తున్నారు. ఇప్పుడు అనుమానితులను కూడా ఆస్పత్రుల్లో చేర్చుకోవాల్సిందేనని..ఆస్పత్రిలో చేరటానికి సర్టిఫికెట్ తప్పనిసరి కాదని తేల్చింది .అదే సమమయంలో ఇతర ప్రాంతాల వారిని ..గుర్తింపు కార్డులు లేవనే కారణంతో కూడా వైద్యం తిరస్కరించకూడదని స్పష్టం చేసింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా నిబంధనల ప్రకారం..ఏ రోగికి కూడా చికిత్స నిరాకంచవద్దు. రోగి వేరే నగరానికి చెందినవాడైనప్పటికీ అవరమైన మందులు, ఆక్సిజన్‌ అందించాల్సిందేనని ఓ ప్రకటనలో పేర్కొంది.

చికిత్సకు వచ్చే వారిని సీసీసీ, డీసీహెచ్‌సీ, డీహెచ్‌సీ వార్డులో అనుమానిత కేసులుగా చేర్చుకోవాలని సూచించింది. కోవిడ్‌-19తో బాధపడుతున్న రోగులకు సత్వరం, సమర్థవంతమైన చికిత్స అందించాలని తెలిపింది. ఆసుపత్రిలో రోగిని అవసరాన్ని బట్టి చేర్చుకోవాలని, పడకలు నిబంధనలకు విరుద్దంగా ఉంచుకోకుండా చూసుకోవాలని తెలిపింది. అన్ని ఆస్పత్రులు విధిగా డిశ్చార్జ్ పాలసీని పాటించాలని పేర్కొంది.

Next Story
Share it