ఫుట్ బాల్ దిగ్గజం డిగో మారడోనా మృతి
BY Admin25 Nov 2020 10:39 PM IST

X
Admin25 Nov 2020 10:39 PM IST
ఫుట్ బాల్ అభిమానులకు షాకింగ్ న్యూస్. అర్జెంజీనాకు చెందిన ప్రముఖ క్రీడాకారుడు డిగో మారడోనా కన్నుమూశారు. ఆయన వయస్సు 60 సంవత్సరాలు. నవంబర్ ప్రారంభంలో ఆయన కు బ్రెయిన్ లో రక్తం గడ్డకట్టడంతో సర్జరీ చేశారు. అయినా సరే ఆయన ప్రాణాలు కాపాడటంతో విఫలమయ్యారు. డీగో మారడోనా 1986లో అర్జెంటీనాకు ఫుట్ బాల్ ప్రపంచ కప్ అందించారు. ప్రపంచ వ్యాప్తంగా డీగో మారడోనాకు అభిమానులు ఉన్నారు. మారడోనా మృతితో ఫుట్ బాల్ క్రీడాలోకం విషాదంలో మునిగిపోయింది. ఆయన మరణవార్త వెలువడిన వెంటనే ఈ ఏడాది ఇంత దారుణంగా ఉంటుందని ఊహించలేదని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
Next Story



