Telugu Gateway
Top Stories

ఎగిరేకార్ల‌కు 'స్లోవేకియా' అనుమతి

ఎగిరేకార్ల‌కు స్లోవేకియా అనుమతి
X

కారులో కూర్చుని విమానంలో లాగా ఎగిరిపోవ‌టానికి ఎప్ప‌టి నుంచో ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి. ఇప్పుడు అవి పూర్త‌య్యాయి కూడా. స్లోవేకియా దేశ ర‌వాణా శాఖ ఇప్పుడు ఎగిరేకార్ల‌కు అనుమ‌తి ఇచ్చింది.8000 అడుగుల ఎత్తులో కార్ల ప్ర‌యాణానికి వీలుగా ఆ దేశ ర‌వాణా శాఖ ఎయిర్ కారుకు అవ‌స‌ర‌మైన ఎయిర్ వ‌ర్తీనెస్ స‌ర్టిఫికెట్ మంజూరు చేసింది. 70 గంట‌ల పాటు ప్ర‌యోగాత్మ‌కంగా కారు ఎగిరిన త‌ర్వాత‌..200కుపైగా టేకాఫ్ , ల్యాండింగ్ లు విజ‌య‌వంతంగా పూర్తి చేసిన త‌ర్వాత ఈ అనుమ‌తులు మంజూరు చేశారు.ఈ ఎగిరేకారు కేవ‌లం 135 సెకండ్ల‌లోనే కారు నుంచి ఎయిర్ క్రాఫ్ట్ గా మార‌నుంద‌ని తెలిపారు.

ఇది గంటకు 160 మైల్స్ స్పీడ్ లో ప్ర‌యాణించ‌గ‌ల‌దు. ఈ ఎయిర్ వ‌ర్తీనెస్ స‌ర్టిఫికెట్ మంజూరు చేయ‌టంతో పెద్ద ఎత్తున ఈ కార్ల ఉత్ప‌త్తికి త‌లుపులు తెరిచిన‌ట్లే అని భావిస్తున్నారు. ప్రాథ‌మిక అంచ‌నా ప్ర‌కారం ఏడాదిలోనే ఇవి అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఈ కార్ల న‌డ‌పటానికి ఎలాంటి ప్ర‌త్యేక శిక్షణ కూడా అవ‌స‌రం ఉండ‌ద‌ని త‌యారీదారులు చెబుతున్నారు. తొలి ద‌శ‌లో ఈ కారు ఇద్ద‌రిని మాత్ర‌మే తీసుకెళ్ళేలా డిజైన్ చేశారు. భ‌విష్య‌త్ లో ఈ సంఖ్య‌ను పెంచే అవ‌కాశం ఉంది.

Next Story
Share it