Telugu Gateway
Top Stories

మెట్రో రైల్....అన్ని ఫస్ట్ లు అక్కడే !

మెట్రో రైల్....అన్ని ఫస్ట్ లు అక్కడే !
X

దేశం లోనే ఫస్ట్ మెట్రో రైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది కోల్ కతా లో. అది కూడా 1984 సంవత్సరంలో. ఆ తర్వాతే దేశ రాజధాని ఢిల్లీ లో కూడా మెట్రో రైల్ సర్వీస్ లు అందుబాటులోకి వచ్చాయి. అది 2002 సంవత్సరంలో. ఇప్పుడు దేశంలో తొలిసారి మెట్రో సర్వీసులు అందుబాటులోకి వచ్చిన అదే కోల్ కతా లో. హుగ్లీ నదిలో అండర్ వాటర్ మెట్రో ట్రయల్ రన్ త్వరలోనే జరగాఉంది. వాస్తవానికి ఇది గత ఆదివారం తలపెట్టిన సడన్ గా ఆగిపోయింది. . పరిమిత కోచ్ లతో ఈ ప్రయోగాత్మక రన్ నిర్వహించనున్నారు. అండర్ వాటర్ టన్నెల్ ద్వారా ఈ మెట్రో ప్రయాణించనుంది. గంటకు 80 కిలోమీటర్ల స్పీడ్ తో ఇది ప్రయాణిస్తుంది. ఈ అండర్ వాటర్ మార్గంలో మెట్రో రైల్ సర్వీసులను త్వరలో ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దేశం లో అద్భుతమైన ఇంజనీరింగ్‌ ప్రతిభకు ఇది ఒక ఉదాహరణగా నిలుస్తుంది అని అధికారులు చెపుతున్నారు.

కోల్‌కతాలో ప్రారంభం కానున్న ఈ అండర్ వాటర్ మెట్రో సర్వీస్ కోల్‌కతా మెట్రో లైన్ - 2 (ఈస్ట్-వెస్ట్ మెట్రో) కిందకు వస్తుంది. . దీనికోసం తవ్విన సొరంగాల నిర్మాణం ఏప్రిల్ 2017 ఏప్రిల్ చివరలో ప్రారంభమయ్యాయి. అలా 30మీటర్ల లోతులో 520 మీటర్ల వరకూ రెండు సొరంగాలు తయారుచేశారు. వివిధ దేశాల నుంచి ఆర్డర్ ఇచ్చిన టన్నెల్ బోరింగ్ యంత్రాలను ప్రత్యేకంగా తెప్పించారు. అలాగే నీరు లీకేజీని నివారించడానికి నాలుగు రక్షణ కవర్లు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ట్రయల్ రన్ దశకు రావటంతో త్వరలోనే ఈ అండర్ వాటర్ మెట్రో అనుభవం కోల్ కతా ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.

Next Story
Share it