Telugu Gateway
Top Stories

తొలిసారి న‌ల‌భై వేల దిగువ‌కు కరోనా కేసులు

తొలిసారి న‌ల‌భై వేల దిగువ‌కు  కరోనా కేసులు
X

మంచి సంకేతాలే. దేశంలో క‌రోనా కేసుల త‌గ్గుముఖం కొన‌సాగుతూనే ఉంది. అదే స‌మ‌యంలో మ‌ర‌ణాలు కూడా తగ్గుతూ వ‌స్తున్నాయి. తొలిసారి క‌రోనా పాజిటివ్ కేసులు న‌ల‌భై వేల దిగువ‌కు వ‌చ్చాయి. గడచిన 24 గంటల్లో 37,566 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత మూడు నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో కేసులు న‌మోదు కావ‌టం ఇదే మొద‌టిసారి. వరుసగా రెండో రోజు 1000లోపు మరణాలు సంభవించాయి. కోవిడ్‌తో సోమ‌వారం నాడు 907 మంది మృతిచెందారు.

అదే రోజు 56,994 మంది కోలుకున్నారు. కేంద్ర వైద్యారోగ్యశాఖ మంగళవారం నాటి బులెటిన్ లో ఈ విష‌యాలు వెల్ల‌డించింది. దేశంలో ఇప్పటివరకు నమోదయిన పాజిటివ్ కేసుల సంఖ్య 3,03,16,897గా ఉంది. మొత్తం 3,97,637 మంది మరణించారు. ఇప్పటి వరకు 2,93,66,601 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 5,52,659 లక్షల యాక్టీవ్‌ కేసులున్నాయి. దేశంలో 96.87 శాతం కరోనా రికవరీ రేటు ఉంది. యాక్టివ్ కేసుల శాతం 1.82 శాతం, మరణాల రేటు 1.31 శాతంగా ఉంది.

Next Story
Share it