Telugu Gateway
Top Stories

ఏభై వేల దిగువ‌కు క‌రోనా కేసులు

ఏభై వేల దిగువ‌కు క‌రోనా కేసులు
X

దేశంలో క‌రోనా రెండ‌వ ద‌శ ముగింపు ద‌శ‌కు చేరుకుంది. గ‌త కొన్ని రోజులుగా వ‌ర‌స‌గా త‌గ్గుతున్న కేసులు ఈ విషయాన్ని నిర్ధారిస్తున్నాయి. తొలిసారి దేశంలో క‌రోనా కేసులు ఏభై వేల దిగువ‌న న‌మోదు అయ్యాయి. అదే స‌మ‌యంలో యాక్టివ్ కేసులు కూడా బాగా త‌గ్గాయి. అయితే ఇప్పుడు అంద‌రి ఫోక‌స్ థ‌ర్డ్ వేవ్ ను ఎలా ఎదుర్కోవాలా అనే అంశంపైనే. గ‌డిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 42,640 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా క‌రోనాతో 1,167 మంది మృతి చెందారు. నిన్న ఒక్కరోజే 81,839 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకున్నారు. దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 2,99,77,861 కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది.

ప్రస్తుతం దేశంలో 6,62,521 మందికి చికిత్స కొనసాగుతుంది. కరోనా నుండి ఇప్పటి వరకు 2,89,26,038 మంది బాధితులు కోలుకున్నారు. కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటివరకు 3,89,302 మంది మర‌ణించిన‌ట్లు అధికారిక గ‌ణాంకాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 96.49% మరణాల రేటు 1.30 శాతంగా ఉంది. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కూ 28,87,66,201 మందికి కరోనా వ్యాక్సిన్లు ఇచ్చారు. నూతన విధానం అమ‌ల్లోకి వ‌చ్చాక సోమ‌వారం నాడు దేశంలో రికార్డు స్థాయిలో ఒక్క రోజులోనే 82.7 ల‌క్షల మందికి వ్యాక్సిన్లు వేసి కొత్త రికార్డు న‌మోదు చేశారు.

Next Story
Share it