Telugu Gateway
Top Stories

అంతరిక్షంలో అదిరిపోయే హోటల్

అంతరిక్షంలో అదిరిపోయే హోటల్
X

మూడు రోజుల ట్రిప్ కు 36 కోట్లు

ప్రపంచంలోనే తొలిసారి 'స్పేస్ హోటల్' అందుబాటులోకి రానుంది. అది 2027 నాటికి సిద్ధం కానుంది. అయితే అక్కడ ఉండాలంటే..మూడున్నర రోజుల ట్రిప్ కు చెల్లించాల్సిన మొత్తం అక్షరాలా 36 కోట్ల రూపాయలు అంట. ప్రపంచం వెలుపల అంటే..అంతరిక్షంలో ఈ హోటల్ రాబోతోంది. దీంతో గాల్లో ఎగరటమే కాదు..ఏకంగా భూమికి దూరంగా కట్టే హోటల్ ఏకంగా బస చేయటానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయన్న మాట. ఈ హోటల్ ఏకంగా 400 మంది ఉండొచ్చు .ఈ స్పేస్ హోటల్ లో రెగ్యులర్ రూమ్స్ తోపాటు సినిమాలు, రెస్టారెంట్లు, బార్స్, కార్యక్రమాల వేదికలు, లైబ్రరీలు, జిమ్నాజియం, భూమిని చూసేందుకు వీలుగా ప్రత్యేక లాంజ్ లు కూడా ఏర్పాటు చేస్తున్నారు.

ఆర్బిటల్ అసెంబ్లీ కార్పొరేషన్ (ఓఏసీ) ద వాయేజర్ స్పేస్ హోటల్ ను నిర్మిస్తోంది. ఈ హోటల్ నిర్మాణం 2025లో ప్రారంభం కానుంది. ఎంతో మంది ఈ హోటల్ లో బసకు ఆసక్తి చూపుతున్న తరుణంలో తాజాగా ఆర్భిటల్ అసెంబ్లీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇక్కడ ఉండటానికి అయ్యే ఖర్చుల వివరాలు కూడా వెల్లడించారు. ఈ అంతరిక్ష హోటల్ లో దొరికే ఆహారం కూడా అంతే ప్రత్యేకతలతో ఉంటుందని అన్నారు. ఐదు మిలియన్లు చెల్లించే వారికి రెగ్యులర్ బర్గర్స్, ఫ్రైస్ పెట్టబోమన్నారు. అయితే ఈ హోటల్ కు బయలుదేరే ముందు పర్యాటకులు సురక్షిత, భౌతిక శిక్షణకు వెళ్లాల్సి ఉంటుందని వెల్లడించారు. ఈ ఆసక్తికర కథనాన్ని 'టైమ్స్ నౌ న్యూస్. కామ్' ప్రచురించింది.

Next Story
Share it